English   

జనగణమణ మళ్ళీ ట్రాక్ మీదకి..ప్యాన్ ఇండియా మూవీగా 

 Puri Jagannadh
2020-06-23 16:39:49

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ఏదీ అంటే తడుముకోకుండా చెప్పే ఆన్సర్ పోకిరి. పూరి జగన్నాధ్ మహేష్ బాబు ల కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా పోకిరి ఇద్దరి కెరీర్ లో మర్చిపోలేని సినిమాగా మిగిలింది. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన రెండో సినిమా బిజినెస్‌మేన్ కూడా సూపర్ డూపర్ హిట్స్ సాధించడంతో మళ్ళీ ఇప్పుడు అందరి చూపు ఈ కాంబోపై పడింది. వీరి నుండి హ్యాట్రిక్ హిట్ వస్తుందని చాలామంది అభిమానులు అలాగే ఇండస్ట్రీ వర్గాలు భావించారు. 

పూరి కూడా ముచ్చటగా మూడో సినిమా జనగణమన సినిమాని తెరకెక్కించి భారీ సక్సస్ కొట్టాలని అనుకున్నారు. కాని ఎందుకనో ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. కాని పూరి జనగణమన మాత్రం ఎప్పటికైనా మహేష్ తోనే చేస్తా అంటూ చెప్పడంతో పాటు మహేష్ సక్సస్ లో ఉన్న దర్శకులతోనే  సినిమా చేస్తాడు అంటు చేసిన కామెంట్స్ అప్పట్లో రచ్చ రేపాయి. దీంతో ఈ ఇద్దరు కలిసి సినిమా చేసే అవకాశాలు దాదాపు లేవనే అనుకున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో మాట్లాడిన సమయంలో మహేష్ పూరీ విషయం మీద క్లారిటీ ఇచ్చారు. 

ఓ నెటిజన్.. భవిష్యత్తులో పూరీతో కలిసి సినిమా చేస్తారా? అని అడగగా మహేష్ ఆసక్తికరంగా స్పందించారు. ఖచ్చితంగా పూరి దర్శకత్వంలో సినిమా చేస్తానని, తనకు ఇష్టమైన దర్శకుల్లో పూరీ ఒకరని, ఆయన కథ నేరేట్ చేస్తారేమో అని ఇప్పటికీ ఎదురుచూస్తున్నానని చెప్పారు. ఒకరకంగా ఆనాటి నుండే మహేష్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు జనగణమన ప్రాజెక్ట్ కి సంబంధిన న్యూస్ వస్తుందో అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఈ విషయం మీద పూరి ఎట్టకేలకి క్లారిటి ఇచ్చారు. జనగణమణ తన డ్రీం ప్రాజెక్ట్ అని త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ని మొదలు పెడతానంటూ టీట్ చేశారు. అయితే అది మహేష్ బాబు తోనా లేక ఇంకెవరైనా హీరో తో చేస్తారా అన్న క్లారిటీ ఇవ్వలేదు. కాని పూరి గతంలో ఈ సినిమా మహేష్ తో తప్ప మరొకరితో చేయనని చెప్పడంతో ఈ సినిమా వీరి కాంబినేషన్ లోనే అని తెలుస్తుంది. అదే నిజమైతే ఈ సినిమా పూరి మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చే హ్యాట్రిక్ సినిమా అవుతుంది. చూడాలి మరి ఏమవుతుందో ?

More Related Stories