English   

టీవీ పరిశ్రమలో కలకలం.. నటుడు ప్రభాకర్‌ కు కరోనా 

Corona
2020-06-24 12:07:27

టివి పరిశ్రమలో కరోనా కలకలం సృష్టించింది. ఛానల్  రేటింగ్స్ పోరులో టీవీ కార్మికులు బలి అవుతున్నారు. లాక్ డౌన్ అనంతరం సీరియల్ షూటింగ్స్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. నామా మాత్రపు జాగ్రత్తలు తీసుకోవడంతో టీవీ నటుడు ఒకరు కరోనా బారినపడ్డట్టు సమాచారం. ప్రముఖ ఛానెల్ సీరియల్ లో నటిస్తున్న ఒక నటుడికి కరోనా పాజిటివ్ రావడంతో షూటింగ్ నిలిపివేశారు. దీంతో టీవీ పరిశ్రమ ఆందోళనలో ఉంది. ఆయనకు కోవిడ్ లక్షణాలు కనిపించడంతో కోవిడ్ టెస్ట్ చేయగా పాజిటివ్ అని వచ్చింది. ఆయన ఇటీవల ఓ టీవీ సీరియల్ షూటింగ్ లో పాల్గొన్నారని తెలుస్తుంది. దీనితో ఆ షూటింగ్ లో పాల్గొన్న టీమ్ సభ్యులు మొత్తం టెన్షన్ లో ఉన్నారు. 

సూర్యకాంతం, మట్టి గాజులు సీరియల్స్ లో నటించే నటుడు ప్రభాకర్ కు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. ప్రభాకర్‌కు పాజిటివ్ వచ్చినట్టు చెబుతూ అతనితో పాటు పనిచేసిన వారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ ఒక ఆడియో మెసేజ్ టీవీ ఇండస్ట్రీ వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది. కాగా, ప్రభాకర్ నటిస్తోన్న సీరియల్స్‌ కు సంబంధించి షూటింగ్‌ లను తాత్కాలికంగా ఆపేసినట్టు సమాచారం. అతనితో పాటు పనిచేసిన వారు అందరూ హోం క్వారంటైన్‌కి వెళ్లినట్టు తెలిసింది.

More Related Stories