రాహుల్ తో డేటింగా..అదేమీ లేదే

ఉయ్యాలా జంపాలా అనే సినిమాతో తన సినీ కెరీర్ ప్రారంభించింది బెజవాడమ్మాయి పునర్నవీ. ఆ సినిమాలో చిన్నారి పెళ్లి కూతురు అవికా గొర్ ఫ్రెండ్ గా పక్కింటి అమ్మాయి లాంటి పాత్రలో నటించిన ఆమె ఆ తర్వాత హీరోయిన్ గా పిట్ట గోడ లాంటి కొన్ని సినిమాలు చేసింది. అయితే అలా హీరోయిన్ గా నటించినప్పటికీ రాని గుర్తింపుని ‘బిగ్ బాస్’ షోలో కో కంటెస్టెంట్ రాహుల్ తో ప్రేమాయాణం సాగించి అందిపుచ్చుకుంది. బిగ్ బాస్ హౌస్ లోనే గ్లామర్ ఒలక బోసిన ఆమె తరువాత బిజీగా మారింది. వరుస సినిమాలు, టీవీ షోలు, ఇంటర్వ్యూలతో పాటు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్‌తో క్షణం కూడా తీరిక లేకుండా గడిపేస్తుంది. ఆ క్రేజ్‌ని అలాగే మెయింటైన్ చేయాలని పునర్నవి ప్రయత్నాలు చేస్తోంది. అందుకే సోషల్ మీడియాలో హాట్ హాట్ పిక్స్ అప్లోడ్ చేస్తూ రచ్చ చేస్తోంది.
అయితే ఆమె బిగ్‌బాస్ లో ఉన్నన్ని రోజులూ రాహుల్ తో డేటింగ్ లో ఉందని పుకార్లు చక్కర్లు కొట్టాయి. తాజాగా ఈ వార్తలపై పునర్నవి నోరు విప్పింది. రాహుల్, తాను మంచి స్నేహితులమని, ఇద్దరి స్నేహం తప్ప మరొకటి ఏమీ లేదని స్పష్టం చేసింది. అయితే పబ్ గొడవ తరువాత మళ్ళీ వీరు డేటింగ్ చేస్తున్నారంటూ పుకార్లు మొదలు కావడంతో మళ్ళీ వాటిపై స్పందించింది పునర్నవి. రాహుల్‌తో తాను డేటింగ్ చేయడం లేదని, తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని ఆమె క్లారిటీ ఇచ్చింది.