English   

నిర్మాతలకి శుభవార్త...ఓటీటీలో పేపర్ వ్యూ విధానం

tollywood
2020-06-24 12:40:32

ఏ రంగమైనా కాలానికి అనుగుణంగా మారాల్సిందే. ముఖ్యంగా ఎంటర్ టైన్ మెంట్ ఫీల్డ్ జనరేషన్ కి తగ్గట్టు కొత్త మార్పులను అందిపుచ్చుకోవాలి. లేకపోతే ఆడియన్స్ తో గ్యాప్ ఏర్పుడుతోంది. మారుతున్న గ్లోబలైజైషన్ తో  సినిమా ఫీల్డ్ కూడా కొత్త పుంత్తలు తొక్కుతోంది. ఒక్కప్పుడు సినిమా కోసం థియేటర్ కి పరుగులు తీసిన ప్రేక్షకులు ఇప్పుడు కూర్చున్న చోటే సినిమాను ఆస్వాధిస్తున్నారు. టెక్నాలజీ పుణ్యమాని సినిమా నెట్టింట్లో నుండి నట్టింట్లోకి వచ్చేసింది. ఇంకా చెప్పాలంటే సినిమా అరచేతిలోకి వచ్చేసింది. సినిమాలను సైతం తలదన్నే రితీలో వెబ్ సిరీస్ లు ఆడియన్స్ ని ఆశ్చర్యపరుస్తున్నాయి.

దీంతో ఫీల్మ్ మేకర్స్ మారుతున్న ఎంటర్టైన్మెంట్ కి అనుగుణంగా సరికొత్త ఆలోచనలతో ఆడియన్స్ కి గాలం వేస్తున్నారు. ఇక ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే సినిమా కంటే డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ దే పై చేయి అయ్యే చాన్స్‌ ఉన్నట్లు కనిపిస్తోంది. సినిమా థియేటర్ లో ఉండగానే టీవీ, కంప్యూటర్, సెల్ ఫోన్స్ లో చూసే అవకాశం కల్పిస్తు ఓటీటీలు ఆడియన్స్ ని టెంప్ట్ చేస్తున్నాయి. టాక్ బాగుండి థియేటర్స్ లో ఆడని సినిమాలకు ఓటీటీ లాభాలను తెచ్చిపెడుతోంది. చిన్న సినిమాల నిర్మాతలకు ఈ డిజిటల్ ప్లాట్ ఫాం ధైర్యం ఇస్తోందని చెప్పొచ్చు.

కాలానికి అనుగుణంగా వస్తున్న మార్పులతో మేకర్స్ సినిమాను ఆడియన్స్ కి మరింత దగ్గర చేసే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ కరోనా దానికి మరింత ఊతం ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కరోనా దెబ్బకు ఇప్పటికే హాల్స్ మూత పడ్డాయి. ఇక ప్రేక్షకుల ఏకైక టైం పాస్ ఒటీటీగా మారింది. అయితే కరోనా ఎన్నాళ్ళ పాటు ఇలా ఉంటుందో ప్రభుత్వాలే చెప్పలేకపోతుంటే ఇప్పటికే ఫైనాన్సులు తెచ్చి వడ్డీలు కడుతున్న నిర్మాతలు భయపడుతున్నారు. సినిమాల్ని ఓటీటీల్లో రిలీజ్ చేసేస్తుండడంతో మునుముందు తెలుగు హీరోలు కూడా అదే బాట పట్టే అవకాశం ఉంది.

అయితే ఇప్పుడు సబ్‌క్రిప్షన్స్‌ ద్వారా కాకుండా పే పర్‌ వ్యూ అనే కొత్త విధానం అమలులోకి తెచ్చే యోచన చేస్తున్నారు. అంటే ఒకసారి సినిమా చూడటానికి సినిమాని, నటులను, బడ్జెట్ ను బట్టి ధరను నిర్ణయిస్తారు. ఆ ధరను ఆన్‌లైన్‌లో చెల్లించగానే సదరు ఓటీటీ సంస్థ పంపించే కోడ్‌ ద్వారా సినిమాను ఒకసారి వీక్షించవచ్చు. అది కూడా కేవలం కోడ్‌ ఒచ్చిన మూడు గంటల వరకే వన్‌టైమ్‌ వాచ్‌బుల్‌గా పనిచేస్తుందని అంటున్నారు. అయితే సినిమాను వీక్షించే ప్రేక్షకులు దీనిని డౌన్‌లోడ్‌, పైరసీ చేయకుండా కూడా ఓ సరికొత్త టెక్నాలజీని వాడబోతున్నారని అంటున్నారు. ఈ కాన్సెప్ట్‌ కనుక నిజంగా వర్కవుటయితే నిర్మాతలకు నిజంగా శుభవార్తని చెప్పచ్చు. ఇప్పటికే ఆర్జీవీ అలా క్లైమాక్స్ అనే ఒక చిన్న సినిమాని అలానే రిలీజ్ చేశారు. అయితే అది రిలీజ్ అయిన కొద్దిసేపటికే పైరసీ నెట్ లో దర్శనం ఇచ్చింది. చూడాలి మరి ఏమవుతుందో ? 

More Related Stories