English   

వివాదంలో పీవీపీ...దాడి చేశారంటూ

Producer PVP
2020-06-24 18:08:35

మరో వివాదంలో విజయవాడ వైసీపీ నేత, టాలీవుడ్ నిర్మాత పీవీపీ చిక్కుకున్నారు. బంజారా హిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 14లోని భూమి విషయంలో తనపై పీవీపీ, అతని అనుచరులు దాడి చేశారంటూ విక్రమ్ కైలాష్ అనే బాధితుడు బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు. అయితే స్థలానికి సంబంధించిన పత్రాలు తన వద్ద ఉన్నాయని పీవీపీ అంటున్నారు. ఓ నిర్మాణ విషయంలో ఇరు వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. పీవీపీకి చెందిన విల్లాస్ లో ఇల్లు కొనుగోలు చేసి అందులో ఉంటున్నామని విక్రమ్ కైలాష్ తెలిపారు. తాము ఇల్లు కొనుగోలు చేసిన సమయంలో ఎలాంటి నిబంధనలు చెప్పకుండా ఇప్పుడు మేము ఏవో మార్పులు చేసుకుంటుంటే వాటిని కూల్చి దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో కూడా ఇలాంటి బెదిరింపులకు పాల్పడ్డారని న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని బాధితుడు విజ్ఞప్తి చేశారు. విక్రమ్ కైలాష్ ఫిర్యాదుపై విచారణ చేస్తామని బంజారాహిల్స్ పోలీసులు చెబుతున్నారు. టెర్రస్ పై గార్డెన్ కట్టొద్దని పీవీపీ బెదిరించారని ఈరోజు 40 మంది అనుచరులతో కైలాష్ విక్రమ్ ఇంటి పై దాడి చేశారని మూడు ఫిర్యాదులు పోలీసులకి అందాయి. 

More Related Stories