English   

సుశాంత్ మరణాన్ని క్యాష్ చేసుకోవద్దు.. నెపోటీజమ్ తప్పు కాదంటున్న రామ్ గోపాల్ వర్మ..

RGV Sushant Singh Rajput
2020-06-25 07:03:20

నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదు అంటాడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు ఈయన. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ మరణం అందరికీ బాధని మిగిలిస్తే ఈయన దాన్ని కూడా కామెడీ చేస్తున్నాడు. ఈ సూసైడ్ విషయంలో బయట చెబుతున్నది అంతా అభూత కల్పన అంటూ కొట్టిపారేస్తున్నాడు వర్మ. ఇండస్ట్రీ ఏదైనా కూడా వారసత్వం అనేది ఉంటుందని.. వాళ్లు తమ కొడుకులను కూతుర్లను తమ స్థాయిలో చూడాలనుకుంటారు అని అందులో ఎలాంటి తప్పు లేదు అంటున్నాడు వర్మ. ఉదాహరణకి ఇప్పుడు చిరంజీవి తన కొడుకును గ్రాండ్ గా లాంచ్ చేస్తాడు కానీ పక్కింటి వాడిని ఎందుకు చేస్తాడు అంటూ ప్రశ్నిస్తున్నాడు. తన వారసత్వాన్ని కొడుకుకి ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదు కదా అంటున్నాడు వర్మ. రాజకీయాల్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి తన కుమారుడు జగన్ కు.. చంద్రబాబు నాయుడు తన కుమారుడు లోకేష్ కు వారసత్వం ఇచ్చాడు కదా.. మరి అందులో లేని తప్పు సినిమా ఇండస్ట్రీలో ఎందుకు కనిపిస్తుంది అని అడుగుతున్నాడు.

తమ వారసత్వం పిల్లలకు ఇవ్వడం నెపోటిజమ్ ఎలా అవుతుంది అని ప్రశ్నిస్తున్నాడు వర్మ. బయటి నుంచి వచ్చిన హీరోలు ఎవరు స్టార్స్ కాలేదా.. విజయ్ దేవరకొండకు ఏ బ్యాక్ గ్రౌండ్ వుందని ఆయన సూపర్ స్టార్ అయ్యాడు.. ఆయన తండ్రి పేరు ఎవరికైనా తెలుసా అని అడుగుతున్నాడు వర్మ. ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరూ తమ కొడుకులను స్టార్లుగా నిలబెట్టలేకపోయారనే విషయం గుర్తుంచుకోవాలి అంటున్నాడు ఈయన. బ్యాక్ గ్రౌండ్ ఏదైనా ఎక్కడి నుంచి వచ్చినా చివరికి వాళ్ళ ఫ్యూచర్ డిసైడ్ చేసేది ఆడియన్స్ మాత్రమే అంటున్నాడు. తన దృష్టిలో సుశాంత్ సింగ్ బాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడిని.. కానీ ఆ విషయం ఆయన నమ్మలేకపోయాడేమో తెలియదు అంటూ సెటైర్ వేశాడు వర్మ. సుశాంత్ చనిపోయిన తర్వాత కొందరు అతడి మరణానికి క్యాష్ చేసుకుంటున్నారు అంటూ అర్థం వచ్చేలా మాట్లాడాడు ఈ దర్శకుడు. తరం జోహార్ తో తనకు 20 ఏళ్లుగా శత్రుత్వం ఉన్నా ఇన్నేళ్లలో ఆయన బాలీవుడ్ కు ఎన్నో సంచలన సినిమాలు ఇచ్చాడని ఆ విషయం గుర్తు పెట్టుకోవాలి అంటున్నాడు. ఒక అగ్ర నిర్మాతగా తనకు కావాల్సిన వాళ్లతో సినిమాలు నిర్మించే స్వేచ్ఛ, హక్కు తనకు ఉన్నాయని.. ఆయన ఎవరితో సినిమా చేస్తే మీకెందుకు అంటున్నాడు. ఏదేమైనా వారసత్వం తప్పు కాదు అంటున్నాడు రామ్ గోపాల్ వర్మ.

More Related Stories