English   

తెలుగు సీరియల్ షూటింగ్ లకు మళ్లీ బ్రేక్.. కరోనాతో కష్టమే..

 TV Serial Shootings
2020-06-25 07:15:44

ఈ మధ్యే మొదలైన తెలుగు సీరియల్ షూటింగ్ లకు మళ్ళీ బ్రేక్ పడేలా కనిపిస్తుంది. ఎంతో సంతోషంగా మొదలైన సీరియల్ షూటింగ్ లు మూడునాళ్ళ ముచ్చటగా ముగిసేలా పరిస్థితులు ఏర్పడ్డాయి. రోజురోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ సినిమా వాళ్ళ పనులకు అడుగడుగునా అడ్డం పడుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఏదో విధంగా కరోనా వాళ్ళపై దాడి చేస్తుంది. గత వారం రోజులుగా తెలుగు సీరియల్ షూటింగ్ లు అన్నీ మొదలైపోయాయి. హైదరాబాదులో అన్ని స్టూడియోస్ లో కూడా షూటింగ్ సందడి కనిపిస్తోంది. జబర్దస్త్ సహా చాలా కార్యక్రమాలు మళ్లీ మొదలయ్యాయి. కోవిడ్ నిబంధనలకు లోబడి ఈ షూటింగులు జరుగుతున్నాయి. అయినా కూడా తాజాగా ఒక సీరియల్ నటుడికి కరోనా వైరస్ సోకడంతో అందరూ కంగారు పడుతున్నారు. ఆయన నుంచి ఇంకా చాలా మందికి ఈ వైరస్ వ్యాప్తి చెందినట్లు ప్రచారం జరుగుతుంది. 

వాళ్లందర్నీ వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి అని యూనిట్ ఆదేశించింది. ఆయనకు కరోనా సోకిన వెంటనే షూటింగులు నిలిపివేసి ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇదే క్రమంలో మరిన్ని షూటింగులు కూడా ప్యాకప్ చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కరోనా వైరస్ నుంచి తప్పించుకోవటం దాదాపు అసాధ్యంగా మారిపోయింది. అందుకే మరి కొన్ని రోజులు ఈ షూటింగులకు దూరంగా ఉండడమే మంచిది అని సీరియల్ టీమ్స్ కూడా భావిస్తున్నాయి. దాంతో వారం రోజుల తిరక్కుండానే షూటింగులకు ప్యాకప్ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే తమిళనాడులో సీరియల్ షూటింగ్ తో పాటు సినిమా షూటింగ్ లకు అనుమతులు క్యాన్సిల్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుందని తెలుస్తుంది. మరోవైపు సినిమా హీరోలు కరోనా వైరస్ పోయే వరకు తాము అడుగు బయటకు పెట్టేది లేదు అని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు.

More Related Stories