English   

బీహార్ లో ఇక వాళ్ళ సినిమాలు చూడటం కష్టమే..

salman alia
2020-06-25 07:26:43

ఒకరి మరణం ఇప్పుడు చాలామందికి తిప్పలు తీసుకొచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకోవటం ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది జరిగి పది రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ ఆయన ధ్యాసలోనే ఉన్నారు. ఆయన మరణం కంటే కూడా మరణించిన విధానం అభిమానులకు అసలు నచ్చడం లేదు. ఎంతో భవిష్యత్తు ఉన్న నటుడు అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలేయడం వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. దీనికి కారణమైన వాళ్లను వదిలిపెట్టేది లేదు ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్లో కొందరు హీరో హీరోయిన్లు సినిమాలు ఇకపై బీహార్లో విడుదల కావు అంటూ వాళ్ళు అల్టిమేటం జారీ చేస్తున్నారు. 

బీహార్ నుంచి బాలీవుడ్ కి వచ్చి స్టార్ స్టేటస్ అందుకున్న హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్. ఈయన ఖచ్చితంగా మరో 20 ఏళ్ళ పాటు బాలీవుడ్లో సంచలనాలు సృష్టిస్తూ షారుక్ ఖాన్ రేంజ్ కి ఎదుగుతాడని వాళ్ళు భావించారు. కానీ కొందరి బంధుప్రీతి కారణంగా కేవలం 34 ఏళ్ల వయసులో చనిపోయాడు. దాంతో సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్, అలియా భట్, సోనం కపూర్, ఏక్తాకపూర్ ఇలా చాలామంది లిస్టు వేసుకొని రెడీగా ఉన్నారు బీహారి అభిమానులు. వాళ్ళ సినిమాలు వస్తే తమ రాష్ట్రంలో విడుదలయ్యేది లేదు అని వాళ్లు తెగేసి చెబుతున్నారు. ఒక అద్భుతమైన నటుడిని దగ్గరుండి అందరూ చంపేశారు.. ఇక మీరు బతుకు చచ్చినట్లే అంటూ బ్యానర్లు కట్టి మరీ సుశాంత్ కు నివాళులు అర్పిస్తున్నారు. మరి ఈ వ్యవహారం ఇంకా ఎంత దూరం వెళుతుందో చూడాలి. ఒకవేళ ఇదే కంటిన్యూ అయితే మాత్రం బాలీవుడ్ సినిమాలకు భారీ నష్టం తప్పకపోవచ్చు. 

More Related Stories