English   

అఖిల్ అక్కినేని ఆధ్యాత్మిక దారి.. అయ్యప్ప దీక్ష తీసుకున్న హీరో..

Akhil Akkineni
2020-06-25 07:41:18

తెలుగు ఇండస్ట్రీలో యూత్ ఐకాన్ లా ఉండే అఖిల్ అక్కినేని స్వామి మాలలోకి మారిపోయాడు. ఈయన అయ్యప్ప దీక్ష తీసుకోవడం అభిమానులకు షాక్ ఇచ్చింది. ఎలాంటి సమాచారం లేకుండా సందడి లేకుండా మాలధారణ చేశాడు అక్కినేని హీరో. నిజానికి ఈయన కుటుంబంలో భక్తి అనే మాట కాస్త తక్కువగానే వినిపిస్తుంది. అఖిల్ తాత నాగేశ్వరరావు దేవుడిని నమ్మడు. నాగార్జున దేవుణ్ణి నమ్మినా ఎప్పుడు ఇలాంటి దీక్షలు తీసుకోలేదు. నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి సందర్భంలో ఉన్నట్లుండి ఒక్కసారిగా అఖిల్ అక్కినేని అయ్యప్ప మాల దీక్ష తీసుకోవడం నిజంగానే కొందరికి షాక్ ఇచ్చింది. అయితే ఈయన మాత్రం మనస్ఫూర్తిగా తనలో తాను మార్పు కోసం అయ్యప్ప మాల వేసుకున్నట్లు తెలుస్తోంది. 

అఖిల్ ను ఆధ్యాత్మికత వైపు నడిపించిన హీరో రామ్ చరణ్ అని ప్రచారం జరుగుతుంది. ఈయన కూడా ప్రతి ఏడాది అయ్యప్ప దీక్ష తీసుకుంటాడు. ఇండస్ట్రీలో శర్వానంద్ లాంటి మరికొందరు హీరోలు కూడా అయ్యప్ప మాల ధారణ చేస్తారు. ఇప్పుడు వీళ్ళ దారిలోనే అఖిల్ అక్కినేని కూడా నడుస్తున్నాడు. అయ్యప్ప మాలలో ఈయన ఫోటోలు చూసి అభిమానులు స్వామియే శరణమయ్యప్ప అంటున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ఈయన ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయిపోయింది. థియేటర్లు ఓపెన్ చేసిన తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విడుదల కానుంది. ఆ లోపు అయ్యప్ప దీక్ష కూడా పూర్తి కానుందని తెలుస్తోంది. ఏదేమైనా అఖిల్ ఆధ్యాత్మిక చింతన చూసి అభిమానులు ప్రశంసిస్తున్నారు. 

More Related Stories