English   

సుశాంత్ సింగ్ ఫైనల్ పోస్టుమార్టం రిపోర్టులో కీలక విషయాలు..

Sushant Singh Rajput
2020-06-25 08:04:03

బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించి వారం రోజులు గడిచిపోయినా కూడా ఇప్పటికే ఆయన ధ్యాసలోనే ఉన్నారు అభిమానులు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఆయన ఫోటోలు వీడియోలు తప్ప వేరే కనిపించడం లేదు. కేవలం బాలీవుడ్ లోనే కాకుండా మిగిలిన ఇండస్ట్రీలలో కూడా తనదైన ముద్ర వేశాడు సుశాంత్. ధోని సినిమాతో అన్ని భాషల్లోనూ ఆయనకు అభిమానులు ఏర్పడ్డారు. ఇదిలా ఉంటే జూన్ 14న ఈయన ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముందుగా ఇది ఆత్మహత్య పోలీసులు తేల్చినా.. రెండు మూడు రోజుల తర్వాత మాత్రం అది ముమ్మాటికీ హత్యే అంటూ సోషల్ మీడియాలో కొన్ని అనుమానాలు రేకెత్తించారు. దీనిపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేసిన ముంబై పోలీసులు చివరికి ఈయనది ఆత్మహత్య అని తేల్చారు.

తాజాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఫైనల్ పోస్టుమార్టం రిపోర్టు కూడా వచ్చింది. ఈ తుది నివేదికలో కూడా ఈయన కేవలం ఊపిరి ఆడక చనిపోయాడని తేల్చారు వైద్యులు. ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ తుది నివేదిక పై ఐదుగురు వైద్యులు సంతకం చేశారు. ఉరితాడుకు వేలాడి ఊపిరాడక సుశాంత్ సింగ్ ప్రాణాలు వదిలాడు అని పోస్టుమార్టం తుది నివేదికలో వెల్లడైంది. దాంతో చాలా అనుమానాలకు తెర పడినట్లయింది. కానీ సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న కూడా ఆయనను అలా పురిగొల్పిన వాళ్లు మాత్రం బాలీవుడ్లో చాలామంది ఉన్నారని.. వాళ్లపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే అంటున్నారు అభిమానులు. 

More Related Stories