English   

ఒటీటీలో బోల్డ్ సినిమా...ఎంఎస్ రాజు క్లారిటీ 

Dirty Hari
2020-06-25 13:28:40

మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి పలు సూపర్ హిట్ సినిమాలను అందించిన సీనియర్ నిర్మాత ఎంఎస్‌ రాజు తర్వాత కాలంలో దర్శకుడిగా మారారు. దర్శకుడిగా మారిన ఆయన తూనీగా తూనీగా, వాన లాంటి సినిమాలు తెరకెక్కించారు. అయితే ఆ సినిమాలి బాగానే ఉన్నా బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం బోల్తా కొట్టడంతో ఆ తర్వాత ఆయన సినిమాలకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇన్నేళ్ల తర్వాత ఎంఎస్‌ రాజు తాజాగా మరో చిత్రానికి దర్శకత్వం వహించేందుకు రెడీ అయ్యారు. తాజాగా ఈ సినిమా టైటిల్ ను ఫిక్స్ చేశారు. ‘డ‌ర్టీ హ‌రి’ అనే టైటిల్‌ని ఈ చిత్రానికి ఫిక్స్ చేస్తూ ఆ మధ్య పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూడటానికి చాలా బోల్డ్ గా ఆసక్తికరంగా ఉంది. 

బాత్ టబ్ లో అబ్బాయి నోట్లో ఓ అమ్మాయి కాలితో సిగరెట్ పెడుతున్న ఆ పోస్టర్ చూస్తుంటే మూవీ కాన్సెప్ట్ ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. నూతన నటుడు శ్రవణ్ రెడ్డి హీరోగా ఈ చిత్రంతో పరిచయం అవుతున్న ఈ సినిమా మీద ఆసక్తి నెలకొంది. అయితే ప్రస్తుతం కరోనా కాలం కనుక ఇప్పట్లో థియేటర్లు తెరుచుకొనే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ క్రమంలోనే డర్టీ హరి సినిమా కూడా ఓటీటీలో రానుందని వార్తలొస్తున్నాయి. అయితే ఎంఎస్ రాజు ఈ విషయం మీద స్పందిస్తూ ఈ సినిమా ఓటిటిలో విడుదల అవుతుందా లేదా అనేది త్వరలోనే ప్రకటిస్తానని అన్నారు. చూద్దాం ఈ సినిమా ఒటీటీలో రిలీజ్ అవుతుందా, లేక థియేటర్స్ వచ్చే దాకా ఆగుతుందా అనేది. 

More Related Stories