English   

సోనూసూద్ కు అరుదైన గౌరవం..మైనపు విగ్రహం ఏర్పాటు 

Sonu Sood
2020-06-25 16:26:33

ప్రముఖ బాలీవుడ్ న‌టుడు సోనూసూద్ ఇప్పుడు ఎందరికో ఆదర్శంగా మారాడు. ఎందుకంటే తెర మీద విలన్ వేషాలు వేసే ఈ నటుడు క‌రోనా కాలంలో ఇబ్బందులు ప‌డుతున్న వ‌ల‌స కార్మికుల‌ని ఆదుకునేందుకు సొంత ఖ‌ర్చుతో రైళ్ళు, ఫ్లైట్స్ ఏర్పాటు చేసి వారిని సొంత రాష్ట్రాల‌కి త‌ర‌లిస్తూ ఎంతో మంది మన్ననలను అందుకుంటున్నారు. అయితే ఆయన సేవ చూసి చాలా మంది మెచ్చుకుంటుంటే కొందరు మాత్రం ఆయనను విమర్శిస్తున్నారు. అయినా ఆయన ఎటువంటి వెనకడుగు వేయకుండా సేవ చేస్తున్నారు. ఇప్పుడు లాక్ డౌన్ లో సడలింపులు ఇవ్వడంతో చాలా వరకూ ప్రయాణ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. అయినా సరే ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇంకా వలస కూలీలు సొంతూళ్లకు వెళ్లేంత స్తోమత లేక ఇబ్బందులు పడుతున్నారు. వారికి కూడా సోనూ సాధ్యమయినంత సాయం చేస్తున్నాడు. 

సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించే ఈ సోనూ ఒక్కసారిగా రియల్ హీరో అయ్యారు. అయితే ఆయన చేసిన సేవకు అరుదైన గౌరవం దక్కింది. లోనావాలాలో ఉన్న ఓ మ్యూజియంలో సోనూ సూద్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంకు పోటీగా ప్రముఖ శిల్పి సునీల్ కందలూర్, పూనాకు సమీపంలోని లోనావాలాలో 2010లో ఏర్పాటు చేసిన మైనపు విగ్రహాల మ్యూజియంలోనే సోనూ సూద్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ మైనపు మ్యూజియంలో దేశ ప్రధాని మోడీ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయి వ్యక్తుల విగ్రహాలు కలిపి మొత్తంగా 100 వరకు సెలబ్రిటీల మైనపు విగ్రహాలున్నాయి.

More Related Stories