అలా సినిమాలు చేయడం కష్టమే...ఇప్పుడే షూట్స్ వద్దు

కరోనా వలన విధించిన లాక్ డౌన్ వలన చాలా కాలంగా సినిమా, సీరియల్ షూటింగ్స్ ఆగిపోయాయి. ఇక నెమ్మదిగా అన్ లాక్ మోడ్ మొదలు కావడంతో నెమ్మదిగా షూటింగ్‌లు మొదలవుతున్నాయి. అయితే కొందరు హీరో హీరోయిన్లు మాత్రం కరోనా ప్రభావ పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు షూటింగ్స్‌కి వెళ్లకపోవడమే ఉత్తమమని ఆలోచిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ముందుగా అలా వినిపించిన పేరు ఏదయినా ఉందా అంటే అది మహేష్ బాబు అని చెప్పచ్చు. ఆయన డిసెంబర్ దాకా సినిమా షూట్ కి రాలేనని చెప్పగా ఇప్పుడు ఆయన బాటలోనే నిత్యా మీనన్ కూడా ఆసక్తికర కామెంట్స్ చేసింది. ప్రస్తుతం తన చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయన్న ఆమె ఏప్రిల్ నుంచి ఈ ఏడాది చివరి వరకు నేను షూటింగ్స్‌లో పాల్గొనాల్సి ఉందని, కరోనా పరిస్థితుల్లో షూటింగ్స్‌లో పాల్గొనకపోవడమే ఉత్తమమని పేర్కొంది. షూట్ లో మాట్లాడుకోకుండా, చర్చించుకోకుండా పని చేయడం కష్టమని చెబుతోంది. లొకేషన్లో ఈ వ్యక్తిగత దూరం పాటించడమనేది మాటల్లో బానే ఉన్నా చేతల్లో కుదరక పోవచ్చని అంటున్నారు.