కేజీఎఫ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..త్వరలో మా టీవీలో

యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శత్వంలో తెరకెక్కిన కేజిఎఫ్. కే.జి.ఎఫ్ ఏమేరకు సెన్సేషనల్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సినిమా కన్నడలోనే కాక తెలుగు, తమిళ, హింది భాషల్లో కూడా భారీ విజయాన్ని సాధించింది. కె.జి.ఎఫ్ సినిమా జోరుతో కె.జి.ఎఫ్- చాప్టర్ 2 కూడా అదే రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. మొదటి పార్ట్ కి వచ్చిన క్రేజ్ దృష్ట్యా బాలీవుడ్ సహా కొన్ని బాషలలో కీలకమైన పాత్రల కోసం స్టార్ నటులను ఈ సినిమాలో నటింప చేశారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మెయిన్ విలన్ అధీరా పాత్రలో నటిస్తుండటం అలాగే లేడీ ప్రధానమంత్రిగా రవీనా టాండన్ నటిస్తుండడంతో ఈ సినిమా మీద ఇంకా అంచనాలు పెరిగిపోయాయి. కేజీఎఫ్ చాప్టర్ 2ని ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది అక్టోబర్ 23న రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు కూడా.
కరోనా బ్రేక్ కారణంగా ఇది వాయిదా పడే అవకాశం ఉంది. దాదాపు ఈ సినిమా వచ్చే ఏడాది వరకు వాయిదా పడింది. షూటింగ్ పునః ప్రారంభించిన తర్వాతే విడుదల తేదీపై క్లారిటీ వస్తుంది. కేజీఎఫ్ 2 తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషలలో ఒకేసారి విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ సినిమా మొదటి భాగం ఇంత పెద్ద హిట్ అయినా ఎందుకో శాటిలైట్ ఇప్పటి దాకా ఎవరికీ అమ్మలేదు. తను అనుకున్న రేటు తెలుగు టీవి ఛానెల్స్ ఎవరూ ఇవ్వడానికి రెడీగా లేనందున ఎవరికీ అమ్మలేదు. ఇంతకాలానికి ఈ మొదటి భాగాన్ని స్టార్ మా టీవీ శాటిలైట్ రైట్స్ ని లాక్ చేసిందని అంటున్నారు. లాక్ అయితే చేశారు కానీ ఎంతకు లాక్ చేసారనే విషయం బయిటకు రాలేదు. అయితే మీడియా వర్గాలు చెబుతున్న దానిని బట్టి అయితే మంచి రేటు వచ్చినట్టే చెబుతున్నారు. ఇక త్వరలోనే ఈ సినిమా వరల్డ్ వైడ్ టీవీ ప్రీమియర్ చేయడానికి రెడీ అవుతోంది.