English   

మరోసారి ఆర్మీ ఆఫీసర్ గా మహేష్..

Mahesh Babu
2020-06-25 18:03:20

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ఏదీ అంటే తడుముకోకుండా చెప్పే ఆన్సర్ పోకిరి. పూరి జగన్నాధ్ మహేష్ బాబు ల కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా పోకిరి ఇద్దరి కెరీర్ లో మర్చిపోలేని సినిమాగా మిగిలింది. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన రెండో సినిమా బిజినెస్‌మేన్ కూడా సూపర్ డూపర్ హిట్స్ సాధించడంతో మళ్ళీ ఇప్పుడు అందరి చూపు ఈ కాంబోపై పడింది. వీరి నుండి హ్యాట్రిక్ హిట్ వస్తుందని చాలామంది అభిమానులు అలాగే ఇండస్ట్రీ వర్గాలు భావించారు. పూరి చాలా కాలంగా జనగణమన తన డ్రీం ప్రాజెక్ట్ అని చెప్పుకుంటూ వస్తున్నాడు. అప్పట్లో మహేష్ హీరోగా ఆ మూవీ దాదాపు ఖాయం అయ్యిందని వార్తలు వచ్చినా ఆ తరువాత జరిగిన పరిణామాలతో అది తెరకేక్కడం కల్ల అనుకున్నారు. అయితే తాజాగా ఈ సినిమా తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నానని అది కూడా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రం తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సినిమా టైటిల్ ని బట్టి ఇది పేట్రియాటిక్ సబ్జెక్టని చెప్పచ్చు. అయితే ఈ సినిమాలో కూడా మహేష్ ను పూరి ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో చూపించనున్నదని అంటున్నారు. ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.  
 

More Related Stories