English   

ప్రజల డబ్బుతో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బయోపిక్..

Sushant Singh Rajput Biopic
2020-06-26 07:14:10

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్. సంచలన విజయాలతో బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సుశాంత్ జూన్ 14 న ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన మరణంపై ఎన్నో అనుమానాలు వచ్చాయి. అయితే చివరికి అది ఆత్మహత్యే అని తేల్చారు వైద్యులు, పోలీసులు. ఊపిరాడక ఉరితాడుకు వేలాది ఆయన ప్రాణాలు వదిలాడు అంటూ పోస్టుమార్టం రిపోర్టులో కూడా తేలింది. ఇదిలా ఉంటే ఈయన చనిపోయిన తర్వాత బయోపిక్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2022లో ఇది విడుదల కానుంది. బాలీవుడ్లో చాలామంది సిండికేట్ గా మారి సంచలన హీరోగా ఎదుగుతున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారని ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్న వేళ.. ఆయన బయోపిక్ చేయడానికి బాలీవుడ్ లో ఎవరు ముందుకు వస్తారు అనే అనుమానాలు వస్తున్నాయి కదా

 అయితే ఇక్కడే అసలు ట్విస్టు ఉంది. సుశాంత్ బయోపిక్ నిర్మించడానికి ఒక నిర్మాత కాదు.. లక్షలాది మంది నిర్మాతలు ముందుకు వస్తున్నారు. అర్థం కాలేదు కదా.. పీపుల్ ఫండింగ్ తో ఈ బయోపిక్ నిర్మించడానికి సిద్ధమవుతున్నాడు దర్శకుడు నిఖిల్ ఆనంద్. దీని కోసం ఆయన కుటుంబ సభ్యుల అనుమతి కూడా తీసుకోవడానికి సిద్ధమవుతున్నాడు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చిన్నప్పట్నుంచీ పెరిగిన విధానం.. ఆయన జీవనశైలి.. బాలీవుడ్ లోకి ఎంటరైన విధానం.. అక్కడినుంచి స్టార్గా ఎదిగిన వైనం.. అన్ని సినిమాల్లో చూపించబోతున్నాడు ఆనంద్. అంతేకాదు సుశాంత్ చావుకు కారణమైన వాళ్లను కూడా బయోపిక్ లో చూస్తారు అంటున్నాడు. 2022 లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా కోసం ఎవరికీ తోచింది వాళ్ళు ఇవ్వచ్చు. అలా జమ అయిన డబ్బుతో సినిమా రానుంది. మరి ఈ బయోపిక్ లో ప్రపంచానికి తెలియని నిజాలు ఏమి చూపిస్తాడో చూడాలి. 

More Related Stories