English   

సౌత్ ఇండియన్ భాషలపై కన్నేసిన విశాల్..

Vishal Chakra
2020-06-26 07:21:43

మన హీరోలకు ఇప్పుడు సింగిల్ మార్కెట్ సరిపోవడం లేదు. అన్ని భాషలు కావాలి అంటున్నారు. కుదిరితే పాన్ ఇండియా సినిమాలు చేయడానికి కూడా రెడీ అయిపోతున్నారు. బాలీవుడ్ లో కూడా పాగా వేయాలని మెంటల్ గా ఫిక్స్ అయిపోతున్నారు. అందుకే అలాంటి కథల వైపు అడుగులు వేస్తున్నారు మన హీరోలు. ఈ క్రమంలోనే తెలుగు హీరోలు ఇప్పటికే ఒక్కొక్కరుగా ఇతర భాషలపై కన్నేస్తున్నారు. ఇప్పుడు విశాల్ కూడా ఇదే చేస్తున్నాడు. ఈయనకు ఇప్పటికే తెలుగు తమిళ భాషల్లో మంచి మార్కెట్ ఉంది. దానికి తోడు ఇప్పుడు మలయాళం కన్నడ భాషల్లో కూడా తనకంటూ సపరేట్ ఫాలోయింగ్ తెచ్చుకోవడానికి విశాల్ అడుగు ముందుకు వేస్తున్నాడు.

 ప్రస్తుతం ఆయన నటిస్తున్న చక్ర సినిమా సౌత్ ఇండియన్ అన్ని భాషల్లో విడుదల కానుంది. ఎంఎస్ ఆనందన్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతో కచ్చితంగా మరో బ్లాక్ బస్టర్ గా కనిపిస్తున్నాడు విశాల్. పైగా ఇప్పుడు విడుదలైన ఫస్ట్ లుక్ కూడా అదిరిపోయింది. త్వరలోనే ట్రైలర్ కూడా విడుదల కానుంది. ఒకేసారి దక్షిణాది భాషల్లో ఈ సినిమాని విడుదల చేస్తున్నాడు విశాల్. దీనికి నిర్మాత కూడా ఆయనే. రెజీనా, శ్రద్ధా శ్రీనాథ్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కచ్చితంగా ఈ సినిమాతో తన మార్కెట్ రెండింతలు పెరుగుతుందని నమ్ముతున్నాడు విశాల్. మరి ఆయన నమ్మకాన్ని చక్ర సినిమా ఎంతవరకు నిలబెడుతుందో చూడాలి. 

More Related Stories