English   

టాలీవుడ్ లో కరోనా కలకలం.. వణికిపోతున్న సెలబ్రిటీలు..

corona tollywood
2020-06-26 07:27:55

మొన్నటికి మొన్న ప్రముఖ నిర్మాత, కమెడియన్ బండ్లగణేష్ కు కరోనా పాజిటివ్ రావడంతో ఒక్కసారిగా టాలీవుడ్ ఉలిక్కిపడింది. ఆయనతో సంబంధాలు ఉన్న వాళ్ళందరూ వెళ్లి టెస్టులు చేయించుకున్నారు. గత రెండు మూడు రోజులుగా ఆయనను కలిసిన వాళ్లు కూడా హోమ్ క్వారంటైన్ కు వెళ్లిపోయారు. బండ్ల గణేష్ ఉండే ఏరియాలోనే ఉండే ఒక హీరోకు కూడా ఇప్పుడు కరోనా వైరస్ భయం పట్టుకుందని తెలుస్తుంది. అందుకే ఆయన తన కుటుంబంతో సహా గెస్ట్ హౌస్ కి వెళ్ళిపోయాడని ప్రచారం జరుగుతుంది. వీళ్లు మాత్రమే కాదు మరికొందరు టాలీవుడ్ సెలబ్రిటీలలో కూడా కరోనా భయం ఇప్పుడు ఓరేంజ్ లో కనిపిస్తుంది. మొన్నటికి మొన్న సమంత క్లోజ్ ఫ్రెండ్ శిల్పా రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో సమంత దంపతులకు కూడా వచ్చింది అంటూ ప్రచారం జరిగింది. 

ఆ మధ్య ఒక టాలీవుడ్ సీనియర్ నటి కుమారుడికి అత్తారింటికి వెళ్ళినప్పుడు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయన నుంచి మరో ఇద్దరు ముగ్గురు కూడా టెస్టులు చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదిలా ఉంటే ఈ మధ్య సీరియల్ షూటింగ్ లు మొదలయ్యాయి. అక్కడ ప్రభాకర్ అనే ఒక సీరియల్ నటుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో దెబ్బకు షూటింగ్ పేకప్ చెప్పేసి అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఎవరికి పడితే వాళ్లకు కరుణ లేకుండా దాడి చేస్తుంది కరోనా వైరస్. ఇలాంటి సమయంలో ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని టాలీవుడ్ సెలబ్రిటీలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. 

More Related Stories