English   

కృష్ణ అండ్ హిస్ లీల రివ్యూ

Krishna and his Leela
2020-06-26 15:28:34

తెలుగు ప్రేక్షకులు సినిమాలు ఇలా ఉంటేనే ఆదరిస్తామనే లైన్ పక్కన పెట్టేశారు. ఎంగేజింగ్ గా ఉంటే ఎటువంటి సబ్జెక్ట్ అయినా, ఎటువంటి జోనర్ అయినా ఆదరిస్తామని చాటి చెప్పారు. అలాగే విమర్శకుల ప్రశంసలు అందుకుని, బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ గా నిలిచిన సినిమాలలో “క్షణం” ఒకటి. హీరో అడివి శేష్‌తో పాటు, దర్శకుడు రవికాంత్ కి కూడా ఈ సినిమా మంచి పేరే తెచ్చి పెట్టింది. అయితే ఈ సినిమా ఇచ్చిన కిక్ తో అడివి శేష్ వెంట వెంటనే మంచి సినిమాలు ఒప్పుకుని చేసుకుంటూ వెళ్లి సక్సెస్ లు కొట్టారు. అయితే క్షణం దర్శకుడు రవికాంత్ పెరెపు చానళ్ళు సైలెంట్ గా ఉండి చేసిన సినిమా కృష్ణా అండ్ హిస్ లీలా సినిమా నెట్ ఫిక్స్ లో రిలీజయ్యింది. ఈ సినిమాని రానా సమర్పించడం, సురేష్ ప్రొడక్షన్స్ వాళ్లు రిలీజ్ చేయడంతో ఈ సినిమా మీద ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ఎలా ఉందొ ఒక సారి చూద్దాం.

కధ : 

ఇది ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. సత్య(శ్రద్ధా శ్రీనాద్)తో ప్రేమలో మునిగిన కృష్ణ (సిద్ధు జొన్నలగడ్డ) కొన్ని కారణాలతో ఆమెతో విడిపోతాడు. తరువాత రాధ(శాలిని)తో ప్రేమలో పడతాడు. ఉద్యోగరీత్యా బెంగళూరు వెళ్ళిన అతనికి మళ్ళీ సత్య కలుస్తుంది. అక్కడ ఆమె మళ్ళీ ఇతనికి దగ్గరవుతుంది. దీంతో రాధతో బ్రేకప్ అవుతుంది. కొన్నాళ్ళకి మళ్ళీ ప్యాచప్ అవుతుంది. దీంతో అక్కడామె..ఇక్కడీమె అన్నట్టుగా ఇద్దరితోనూ ప్రేమాయణం సాగిస్తాడు. చివరికి ఈ ప్రేమాయణం ఎలా ముగిసిందనేది సినిమా కథ. 

ఎలా ఉంది:

ఇలాంటి కథలు కొంచెం అటూ ఇటూగ మనం ఇప్పటికే చాలా చూసి ఉంటాం. కథలో కాని స్క్రీన్ ప్లే లో కానీ ఎక్కడా కొత్తదనం లేకున్నా దర్శకుడు పాత్రలను డిజైన్ చేసిన తీరు, వాటి మధ్య జరిగే సంభాషణలు చాలా సహజంగా కుదిరాయి. ఈ కాలం కుర్రాళ్ల మనస్తత్వాలను కళ్ళకి కట్టినట్టు చూపాడు దర్శకుడు. కామెడీ జోడించడంతో సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. కాకపోతే ఒకటే పాయింట్ చుట్టూ తిరుగుతూ వుండడం వల్ల చికాకు తెప్పిస్తుంది. షార్ట్ ఫిలిం కంటెంట్‌ని లాగి సినిమా చేశారన్న ఫీల్ వచ్చినా కన్విన్సింగ్ ఎండింగ్ ఇచ్చాడని చెప్పచ్చు. 

ఎవరెలా చేశారు.. 

ప్రేమ.. ప్రియురాళ్ళ విషయంలో క్లారిటీ లేని కృష్ణ సిద్ధూ మంచి ఈజ్ తో నటించాడు. ఇక అతనితో బ్రేకప్ అయి మళ్ళీ అతనికి దగ్గరయిన సత్యగా శ్రద్ధా సత్య పాత్రలో ఒదిగిపోయింది. ఇక షాలిని కూడా బాగానే నటించింది. ఇక హర్ష కమేడియన్ గా మంచి పాత్రలో కనిపించాడు. కానీ సంపత్, ఝాన్సీ,రాజ్ మాదిరాజు లాంటి మంచి నటులను, సీరత్ కపూర్ లాంటి వారిని ఎందుకు తీసుకున్నారో తెలీదు. వారిని ఒకటి రెండు సీన్లకే పరిమితం చేసేశారు .

నిర్మాతగా సురేష్ ప్రొడక్షన్స్ వయా కాం స్టూడియోస్ ఉండడంతో ఎక్కడా నిర్మాణం విషయంలో రాజీపడలేదు. ఇక ఈ సినిమాకి సంగీతం ముఖ్యంగా నేపధ్య సంగీతం అడిరిపోయిందనే చెప్పాలి. శ్రీ చరణ్ పాకాల తన మ్యూజిక్ తో ఆకట్టుకున్నారు. దర్శకుడిగా రవికాంత్ ఫర్వాలేదనిపించారు. తను అనుకున్న విధంగా కథనాన్ని నడిపించడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. కృష్ణ, రాధ, సత్య అంటూ కృష్ణుడికి సంబందించిన పేర్లు పెట్టి దానిని కధనానికి చేసిన లింక్ బాగుంది. 

ఫైనల్లీ : కృష్ణుడి లీలలు బోర్ కొట్టించవు

రేటింగ్ : 2.75.

More Related Stories