English   

బావా అంటూ హైపర్ ఆదితో హాట్ యాంకర్ రొమాన్స్ 

Hyper Aadi
2020-06-26 17:07:52

హైపర్ ఆది గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బుల్లితెర లీడింగ్ షో జబర్దస్త్ లో మనోడు చేసే కామెడీకి వీర లెవల్లో ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అయితే ఆయన పంచ్ లను గట్టిగా వాడదామని మల్లెమాల వారి మరో షో డీలో కూడా తీసుకున్నారు. కానీ జబర్దస్త్ కామెడీ ఇక్కడ పెద్దగా వర్కౌట్ కావడం లేదు. అతన్ని మించినోడు ప్రదీప్ ఉండడంతో ఎప్పటికప్పుడు ప్రదీప్ తో పోటీ పడలేక చతికిల పడుతున్నాడు. అయితే ఈ ఢీ షోలో ఆది ఉన్న ఏకైక ఊరట ఏదయినా ఉందా అంటే అది యాంకర్ వర్షిణి అనే చెప్పాలి. ఆమెకు మొదటి నుండి ఈ షోలో తింగరిది అని పేరుంది. ఇప్పుడు దాదాపుగా ఆది కూడా ప్రదీప్ చేతిలో తింగరోడు అవుతున్నాడు. అందుకే మైనస్ మైనస్ కలిస్తే ప్లస్ అన్నట్లు వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతోంది. దీంతో రష్మి, సుదీర్ జోడీలాగా వీరి జోడీని కూడా బాగా ప్రమోట్ చేస్తోంది మల్లెమాల టీం. ఇక లాక్ డౌన్ పిరియడ్ లో ఇద్దరూ ఎడబాటు తట్టుకోలేకపోయారో ఏమో...కానీ నిన్నటి షోలో హైపర్ ఆదిని చూడగానే...వర్షిణి ముద్దుగా బావా అని పిలిచి అతడిలో కరెంట్ నింపింది. దీంతో హైపర్ ఆదికి ఉబ్బితబ్బిబ్బు అయిపోయాడు. అలా లాక్ డౌన్ తర్వాత మరోసారి ఢీ షో ఎనర్జిటిక్ గా స్టార్ట్ అయ్యిందనే చెప్పాలి.

More Related Stories