English   

షూటింగ్‌లో ప్రమాదం..బైక్ మీద నుండి కింద పడ్డ శ్రద్ధా...

Shraddha Srinath
2020-06-26 17:20:57

శ్రద్ధా శ్రీ‌నాథ్ అంటే జెర్సీ ముందు దాకా పెద్దగా తెలుగు వాళ్ళకి పరిచయం లేదు కానీ జెర్సీ రిలీజ్ తర్వాత ఆమెను జనం మర్చిపోలేక పోతున్నారు. పొట్టి ముక్కుతో కుదురైన ముఖంతో తెలుగు వాళ్ళకు బాగానే దగ్గరయ్యింది ఈ భామ. ముందు నుండీ ఈ భామ బోల్డ్ అనే పేరు తెచ్చుకుంది. నిజానికి కన్నడ లో యూ టర్న్ సినిమా చేసింది ఈమె, దానిని తెలుగులో రీమేక్ చేశారు. అయితే తాజాగా ఆమె తెలుగులో నటించిన 'కృష్ణ అండ్ హిజ్‌ లీల' మూవీ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయి మంచి పేరు తెచ్చుకుంది. క్షణం దర్శకుడు రవికాంత్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించాడు. సీరత్‌ కపూర్‌, శాలినీ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. 

అయితే ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా జూన్‌ 2017లో నందిహిల్స్‌లో షూట్‌ జరుగున్న సమయంలో తాను బైక్ మీద నుండి కింద పడ్డానని ఆమె తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దర్శకుడు శ్రద్ధా దగ్గరికి వచ్చి ‘బైక్‌ నడపడం వచ్చా?’ అని అడిగాడట. అయితే ఆమె నో.. అని చెప్పి.. ప్రయత్నిస్తా.. అని ధైర్యంగా బైక్‌ ఎక్కి నడిపే ప్రయత్నం చేసిందట. అయితే రోడ్డు తడిగా ఉండడంతో బుల్లెట్‌ బ్యాలెన్స్‌ చేయలేక స్కిడ్‌ అయ్యి కిందపడ్డానని ఆ పోస్ట్ లో ఆమె పేర్కోంది.  సెట్‌లో ఉన్న వారంతా నాకేమైందోనని కంగారు పడుతూ పరుగులు తీశారని, అయితే బైక్‌ కొద్దిగా పాడైయింది కానీ తనకేమీ కాలేదని చెప్పుకొచ్చింది. అలాగే ఎన్‌ఫీల్డ్‌ ఎందుకు అంత బరువుగా ఉంటుంది..?' అని ఆమె తన అనుభవాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఇక ప్రస్తుతం చక్ర అనే సినిమాలో శ్రద్ధ నటిస్తోంది. విశాల్‌ హీరోగా తన సొంత నిర్మాణ సంస్థలోనే ఈ సినిమా రూపొందుతోంది.

More Related Stories