English   

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఆఫీసులో కరోనా కలకలం..

Tollywood
2020-06-26 17:45:25

టాలీవుడ్ లో ఆయన ప్రముఖ టాలీవుడ్ నిర్మాత.. పైగా పేరు మోసిన డిస్ట్రిబ్యూటర్ కూడా. ముఖ్యంగా యంగ్ హీరోల సినిమాలను కొనేసి విడుదల చేస్తుంటాడు ఈయన. అలాంటి డిస్ట్రిబ్యూటర్ కమ్ ప్రొడ్యూసర్ కు ఇప్పుడు కరోనా కష్టాలు వచ్చాయని తెలుస్తుంది. ఆయన ఆఫీస్ నిండా కరోనా కేసులు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. అంతమంది ఒకేసారి కరోనా బారిన పడటంతో ఆ నిర్మాతకు వణుకు మొదలైంది. వెంటనే ఉన్న పనులు అన్నీ ఆపేసి.. అంతా ఇళ్లకు వెళ్లిపోమ్మంటూ ఆఫీసులకు తాళాలు వేసినట్లు తెలుస్తుంది. ఆ ప‌రిస‌రాల్లోని మిగిలిన సినిమా ఆపీస్ ల‌ను మూసేసారని వార్తలు వస్తున్నాయి. వైరస్ బారిన పడతామ‌నే భయంతో మూసి వేసారు. ఇప్పటికే తెలుగులో ఎన్నో సినిమాలు ఆయన డిస్ట్రిబ్యూట్ చేసాడు.. ఇప్పుడిప్పుడే నిర్మాతగా కూడా రాణిస్తున్నాడు. ఇలాంటి సమయంలో కరోనా అటాక్ కావడంతో ఆ నిర్మాతకు భయం మొదలైంది. ఏం జరుగుతుందో అనే టెన్షన్ లోనే ఉంటున్నాడు ఆయన. 

More Related Stories