షారుక్ ఖాన్ సైలెంట్‌గా రిటైర్మెంట్ ఇచ్చేసాడా ఏంటి..

అభిమానుల కంగారు చూస్తుంటే ఇప్పుడు ఇదే నిజమేమో అనిపిస్తుంది. అసలే వరస ఫ్లాపులు వస్తుంటే షారుక్ ఖాన్ ఎవరికీ చెప్పకుండా షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడేమో అనిపిస్తుంది. టైమ్ బాలేనపుడు అరిటిపండు తిన్నా పన్నిరిగిద్ది అంటారు కదా.. ఇప్పుడు షారుక్ ఖాన్ కు అదే జరుగుతుంది. అసలు ఎలా ఉండే హీరో.. ఇప్పుడు ఎలా అయిపోయాడు అనిపిస్తుంది ఇప్పుడు షారుక్ ను చూస్తుంటే. ఈయన సినిమాలు వచ్చినట్లు కూడా ఎవరికీ తెలియడం లేదు. ఆరేళ్లుగా ఒక్క సినిమా కూడా ఈయనకు హిట్ తీసుకురాలేదు. వచ్చిన సినిమా వచ్చినట్లు వెళ్లిపోతున్నాయి. రెండేళ్ల కింద విడుదలైన జబ్ హ్యారీ మెట్ సెజల్ కూడా డిజాస్టరే. ఏ సినిమాకు కూడా కనీసం 100 కోట్లు రావడం లేదు. ఒకప్పుడు కింగ్ లా బాక్సాఫీస్ ను ఏలేసిన ఈ హీరో.. ఇప్పుడు ఉనికి కోసం ప్రయత్నిస్తున్నాడు.
జీరో కూడా డిజాస్టర్ అయిపోయింది. ఆరేళ్లు దాటిపోయింది షారుక్ సినిమా బాక్సాఫీస్ ను కసితీరా కుమ్మేసి. చెన్నైఎక్స్ ప్రెస్ తర్వాత ఆ స్థాయి సినిమా మళ్లీ షారుక్ కు పడలేదు. ఫ్యాన్.. దిల్ వాలే.. రాయీస్.. హ్యాపీ న్యూ ఇయర్.. ఇలా ప్రతీ సినిమా వస్తుంది వెళ్తుంది కానీ ఏదీ బాద్షా రేంజ్ మార్చలేదు. జబ్ హ్యారీ మెట్ సెజల్ తో అయినా బ్లాక్ బస్టర్ కొడతాడేమో అనే ఆశలో ఉన్న ఫ్యాన్స్ కు ఈ సారి కూడా సారీ చెప్పేసాడు షారుక్ ఖాన్. ఆ తర్వాత జీరో కూడా దారుణంగా ఫ్లాప్ అయింది. ఈ సినిమా కూడా డిజాస్టర్ అయిన తర్వాత షారుక్ పూర్తిగా సినిమాలకు దూరం అయిపోయాడు. రెండేళ్ల నుంచి ఈయన అస్సలు సినిమాల గురించి ఆలోచించడం లేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో అభిమానులను మెప్పించడం అనేది చిన్న విషయం కాదు. అక్కడ ఎలాంటి సినిమాలు చేసినా కూడా ఎందుకో కానీ కలెక్షన్లు మాత్రం ముందులా రావడం లేదు. మరి చూడాలిక.. షారుక్ ఖాన్ ప్రేక్షకులకు మెచ్చే స్క్రిప్ట్ తో ఎప్పుడు రానున్నాడో..?