English   

నిర్మాణ రంగంలోకి మరో హీరో

Ravi Teja
2020-06-27 07:31:02

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెతను మన తెలుగు స్టార్స్ మాత్రం సీరియస్ గా తీసుకుంటున్నారు. నాలుగు రాళ్ళు సంపాదిస్తున్నప్పుడే వీరు తమ డబ్బును వివిధ రూపాల్లో పెట్టుబడులు పెట్టి దానిని రెండింతలు చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ పద్దతిని అందరూ ఫాలో అవుతూ ఉంటారు. ఇందులో ఎవరూ మినహాయింపు కాదు. స్టార్ నటుల నుండి చిన్నా చితకా వారి దాకా అందరూ ఈ సూత్రాన్ని ఫాలో అవుతూ ఉంటారు. ఇప్పటికే మ‌హేష్ బాబు, కళ్యాణ్ రామ్, విజయ్ దేవరకొండ లాంటి చాలా మంది సొంత బ్యానర్స్ పెట్టి సినిమాలు నిర్మిస్తున్నారు. ఇప్పుడు అదే దారిలో రవితేజ కూడా నడవనున్నట్టు చెబుతున్నారు. ర‌వితేజ సినిమా నిర్మాణంలోకి అడుగు పెట్టే అవ‌కాశాలున్నాయ‌ని ఫిలిం నగర్ టాక్. ప్రొడ‌క్ష‌న్ హౌస్‌ను స్టార్ట్ చేసి కొత్త టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తే ఎలా ఉంటుంద‌నే దానిపై ర‌వితేజ ఆలోచన చేస్తున్నాడని అంటున్నారు. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే ఆయన మలినేని డైరెక్షన్ లో క్రాక్‌ సినిమా చేస్తున్నాడు. క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఈ చిత్ర షూటింగ్ నిర‌వ‌ధికంగా ఆగిపోయింది. ఈయన ర‌మేశ్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా, త్రినాథ రావు న‌క్కిన ద‌ర్శక‌త్వంలో ఓ సినిమాతో పాటు మ‌ల‌యాళ సినిమా రీమేక్‌లోనూ ర‌వితేజ న‌టించ‌నున్నారు.

More Related Stories