English   

వెబ్ సిరీస్ నిర్మాణంలోకి యూవీ క్రియేషన్స్

UV Creations
2020-06-27 07:39:31

సినిమాలను సైతం తలదన్నే రితీలో వెబ్ సిరీస్ లు ఆడియన్స్ ని ఆశ్చర్యపరుస్తున్నాయి. దీంతో ఫీల్మ్ మేకర్స్ మారుతున్న ఎంటర్టైన్మెంట్ కి అనుగుణంగా సరికొత్త ఆలోచనలతో ఆడియన్స్ కి గాలం వేస్తున్నారు. ఇక ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే సినిమా కంటే డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ దే పై చేయి అయ్యే చాన్స్‌ ఉన్నట్లు కనిపిస్తోంది. సినిమా థియేటర్ లో ఉండగానే టీవీ, కంప్యూటర్, సెల్ ఫోన్స్ లో చూసే అవకాశం కల్పిస్తు ఓటీటీలు ఆడియన్స్ ని టెంప్ట్ చేస్తున్నాయి. టాక్ బాగుండి థియేటర్స్ లో ఆడని సినిమాలకు ఓటీటీ లాభాలను తెచ్చిపెడుతోంది. అందుకే పెద్ద నిర్మాణ సంస్థలు సైతం వాటిని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు భారీ చిత్రాలు నిర్మించడంతో పాటు తెలుగు ప్రేక్షకులకు వైవిధ్యమైన సినిమాలు అందించడంలో ముందు వరుసలో ఉన్న యూవీ క్రియేషన్స్ సంస్ధ కూడా అదే బాటలో నడుస్తున్నట్టు చెబుతున్నారు. అయితే మామూలు వాళ్ళలా కాకుండా స్టార్ డైరెక్టర్లతో ఈ సిరీస్ చేసే పనిలో ఉన్నారని అంటున్నారు. పూరీ, సుజిత్ లాంటి దర్శకులని వీళ్ళు అప్రోచ్ అవుతున్నారని అంటున్నారు. ప్రస్తుతం వీరు ప్రభాస్ నటిస్తున్న 20వ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈమూవీకి జిల్ మూవీ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.  

More Related Stories