English   

దాసరి ఇంట్లో గొడవలు.. పరిస్థితి ఎటు వైపు వెళ్తుందో..

Dasari Family
2020-06-27 11:08:49

న్యాయం చెప్పే వాడికి అన్యాయం జరుగుతోందంటూ ఇండస్ట్రీలో ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. దాసరి నారాయణరావు బతికి ఉన్నప్పుడు ఎంతో మందికి ఎన్నో చేశాడు. ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా కూడా పెద్ద దిక్కుల ముందుకొచ్చి నిలబడ్డాడు. అయ్యా అన్న వాళ్ళ కష్టాన్ని తీర్చాడు. అయితే అలాంటి దాసరి నారాయణరావు ఇంట్లో ఇప్పుడు ఆస్తి గొడవలు జరగడం నిజంగానే శోచనీయం. దాసరి ఇద్దరు కొడుకులు ప్రభు, అరుణ్ కుమార్ మధ్య కొన్నేళ్లుగా ఆస్తి గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆయన చనిపోయిన తరువాత ఇది తీవ్రస్థాయికి చేరిపోయాయి. ముఖ్యంగా దాసరి నారాయణరావు పెద్ద కోడలు, ప్రభు భార్య మీడియా ముందుకు వచ్చి తమకు అన్యాయం జరుగుతుంది అంటూ మొర పెట్టుకుంది. మోహన్ బాబు లాంటి వాళ్లను కూడా ఆమె ఏకి పారేసింది. ఇలాంటి సమయంలో తాజాగా తన తమ్ముడు అరుణ్ కుమార్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసాడు అన్నయ్య ప్రభు. 

అర్ధరాత్రి తాగి వచ్చి తన ఇంట్లో అరుణ్ గొడవ చేశాడని.. అక్రమంగా గోడ దాటి లోపలికి వచ్చి నానా రభస చేశాడు అంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అంతేకాదు తనను తన కుటుంబాన్ని చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడని కంప్లైంట్ లో తెలిపాడు ప్రభు. ప్రస్తుతం తాను ఉంటున్న ఇల్లును తన తండ్రి దాసరి మనవరాలు పేరు మీద రాసాడని.. ఆ వీలునామా ప్రకారమే మా ఇంట్లో ఉంటున్నామని ప్రభు చెబుతున్నాడు. కానీ ఈ విషయంపై అరుణ్ కుమార్ వాదన మరోలా ఉంది. ఏదేమైనా కూడా ఇండస్ట్రీలో ఎన్నో సమస్యలు చేసిన దాసరి కుటుంబంలో ఇలాంటి ఆస్తి తగాదాలు రావడం కొందరు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇండస్ట్రీలో ఉన్న పెద్ద మనుషులు దాసరిపై ఉన్న గౌరవంతో ఏమీ మాట్లాడడం లేదు. మరి ఈ ఆస్తి తగాదాలు ఎంత దూరం వెళ్తాయో చూడాలి. 

More Related Stories