English   

కరణ్ జోహార్.. నువ్వు మామూలోడివి కాదురా నాయనా..

Janhvi Kapoor
2020-06-27 11:14:15

బాలీవుడ్ లో ఎంత మంది దర్శక నిర్మాతలు ఉన్నా కూడా కరణ్ జోహార్ కూడా తెలివితేటలు మాత్రం వారిలో కనిపించవు. ఆయన పెద్ద వాళ్లతోనే సినిమాలు చేస్తాడు.. బంధుప్రీతి చూపిస్తాడు.. ఇవన్నీ పక్కనపెడితే సినిమా బిజినెస్ పరంగా కరణ్ జోహార్ కు ఉన్న తెలివితేటలు మాత్రం నిజంగానే అద్భుతం. అసలు ఏ మాత్రం అంచనాలు లేని సినిమాలు కూడా అద్భుతంగా ప్రమోట్ చేసి డబ్బులు వచ్చేలా చేసుకోవడంలో కరణ్ జోహార్ నిష్ణాతుడు. ఇప్పుడు కూడా ఇదే చేశాడు ఈయన. జాన్వీ కపూర్ ప్రధానపాత్రలో గుంజన్ సక్సేనా అనే సినిమా వస్తుంది. కార్గిల్ యుద్ధంలో యుద్ధ విమానాన్ని నడిపిన లేడీ పైలట్ గుంజన్ సక్సేనా జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. 

నిజానికి మార్చిలోనే విడుదల కావాల్సి ఉన్నా కూడా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ధడక్ సినిమా తర్వాత మరోసారి తన ప్రొడక్షన్ లోనే జాన్వీ కపూర్ కు అవకాశం ఇచ్చాడు కరణ్ జోహార్. అయితే ఈ సినిమాపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. పైగా లాక్ డౌన్ కూడా రావడంతో గుంజన్ సక్సేనాను అందరూ మర్చిపోయారు. అలాంటి సమయంలో కూడా కరన్ జోహర్ ఈ సినిమాకు అదిరిపోయే బిజినెస్ చేశాడు. ఇప్పుడు అందరూ థియేటర్లో మూసి వేయడంతో డిజిటల్ ప్లాట్ ఫామ్ వైపు అడుగులు వేస్తున్నారు. జాన్వీ కపూర్ గుంజన్ సక్సేనా సినిమాలు కూడా నెట్ ఫ్లిక్స్ వాళ్లకు ఏకంగా 70 కోట్లకు అమ్మేశాడు కరణ్. థియేటర్లలో విడుదల అయి ఉంటే కనీసం 40 కోట్ల బిజినెస్ కూడా చేయని సినిమాలు ఏకంగా 70 కోట్లకు అమ్మేశాడు. ఆయన తెలివి తేటలు చూసి ఏమనాలో ఎవరికీ అర్థం కావడం లేదు. 

More Related Stories