English   

స్పందించిన  దాసరి అరుణ్..మా అన్న డిప్రెషన్ లో ఉన్నాడు 

Dasari arun
2020-06-27 14:10:14

దాసరి కుటుంబంలో మరోసారి ఆస్తి వివాదం తలెత్తింది. దాసరి ఇద్దరు కుమారుల మధ్య ఎన్నాళ్లుగానో ఉన్న ఆస్తి గొడవ...మళ్లీ తెరపైకి వచ్చింది. దాసరి అరుణ్ తమ ఇంట్లోకి అక్రమంగా చొరబడ్డాడని దాసరి ప్రభు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 24న ప్రభు ఇంటి గేటు దూకి...అరుణ్ కుమార్ లోపలికి ప్రవేశించాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆస్తి వివాదంపై మోహన్‌బాబు, సి.కల్యాణ్‌, మురళీ మోహన్ స్పందించాలని దాసరి ప్రభు అంటున్నారు. ఈ విషయం మీద దాసరి అరుణ్ స్పందించారు. నేను ఎవరి ఇంట్లోకి దౌర్జన్యంగా వెళ్లలేదని, నా అడ్రస్ ప్రూఫ్ లు అన్ని అదే ఇంటి అడ్రస్ తో ఉన్నాయని అన్నారు. ఆ ఇల్లు నాది కూడానన్న ఆయన నాకు కొరియర్ వస్తే తీసుకోవడానికి వెళ్ళానని అన్నారు.

అంతే తప్ప నేను ట్రెస్ పాస్ చేయలేదని, అసలు మందు తాగి దూకానని చెప్పడం కరెక్ట్ కాదని అన్నారు. నేను పోలీసులు సమక్షంలోనే కొరియర్ తీసుకొన్నానన్న ఆయన మందు తాగి దూకితే కింద పడిపోతానని అన్నారు. ఇద్దరి మధ్య  గత ఏడాది మే నుండి గొడవ నడుస్తోందని, నా పై అప్పుడు ఫిర్యాదు చేశాడని సోదరితో కలిసి కూర్చుంటే సెటిల్ అవుతుందని అన్నారు. ఒక చిన్న కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య నెలకొన్న వివాదమన్న ఆయన చాలా చిన్న సమస్య అయిన ఇందులో ఇతరుల ప్రమేయం అవసరం ఉండదని అన్నారు. గతంలోనే మురళీ మోహన్, మోహన్ బాబు, సీ కళ్యాణ్ లు సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించారని, ఆ ఇంటి పై కోర్టు ఆర్డర్ ఉంది.. ముగ్గురిలో ఎవరు కూడా ఒకరికి తెలియకుండా మరొకరు  అమ్ముకోవద్దని చెప్పారని అన్నారు. నేను లాకర్ తెరవడానికి ప్రయత్నించాను అని అనడంలో అర్థం లేదని, మా సోదరుడు డిప్రెషన్ లో ఉన్నాడు అని అనుకుంటున్నాననని అరుణ్ అన్నారు.

More Related Stories