English   

సుశాంత్ మరణంపై సీబీఐ ఎంక్వయిరీ కావాలంటున్న నటి..

Roopa Ganguly
2020-06-27 17:16:32

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై అనుమానాలున్నాయని.. ఆయన ఆత్మహత్య కేసుపై సిబిఐ ఎంక్వైరీ వేయాలి అంటూ ఇప్పటికే కొందరు మాట్లాడారు. తాజాగా ఇదే కోవలోకి బాలీవుడ్ నటి రూప గంగూలీ కూడా చేరింది. సుశాంత్ మరణంపై సీబీఐ విచారణ చేపట్టాలని ఈ బీజేపీ ఎంపీ డిమాండ్ చేసింది. సుశాంత్ మరణం వెనుక ఏదో మిస్టరీ ఉన్నట్లు ఆమె తెలిపింది. ఈ మేరకు తన ట్విట్టర్ లో కొన్ని ప్రశ్నలు సంధించింది రూపా గంగూలీ. సుశాంత్ మరణానికి దారి తీసిన సంఘటనలపై వెంటనే సీబీఐ విచారణ చేపట్టాలని ఆమె డిమాండ్ చేసింది. ఇదిలా ఉంటే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంలో ఎలాంటి అనుమానాలు లేవని.. ఆయన ఆత్మహత్య చేసుకోవడం వల్లే చనిపోయాడు అండ్ ఫైనల్ పోస్టుమార్టం రిపోర్టులో కూడా వైద్యులు  స్పష్టం చేశారు. కానీ ఇప్పటికీ కొందరు మాత్రం ఆయనను పక్కా ప్లాన్ ప్రకారం చంపేశారు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 

ఇదిలా ఉంటే సుశాంత్‌ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఆపరేట్ అవుతున్న తీరు అనుమానాలు కలిగిస్తున్నట్లు రూపా గంగూలీ ఆరోపించింది. సుశాంత్ ఫాలో అయిన అభిమానుల్ని ఎలా అతని అకౌంట్ నుంచి అన్‌ఫాలో చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. సుశాంత్ మరణంపై సీబీఐ విచారణ చేపట్టాలని ప్రధాని మోదీ, కేంద్ర హోంశాక మంత్రి అమిత్ షాను ఆమె కోరారు. అందుకే తాను చేసిన ట్వీట్ లను వాళ్లకు ట్యాగ్ చేసింది. సుశాంత్ ఇన్‌స్టా అకౌంట్ నుంచి అన్‌ఫాలో అవుతున్నారంటే అది సాక్ష్యాన్ని తుడిచిపెట్టడమే అని ఆమె ఆరోపించింది. అందుకే వీలైనంత త్వరగా సీబీఐ ఈ కేసును విచారించాలని రూపా గంగూలీ డిమాండ్ చేస్తుంది.

More Related Stories