English   

మహేష్ సినిమాలో యంగ్ హీరోయిన్

 Nivetha Thomas
2020-06-27 17:27:06

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశు రామ్ డైరెక్షన్ లో సర్కారు వారి పాట అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన మహానటి ఫేమ్ కీర్తి సురేష్ నటించనుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించింది కూడా. అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటించనుందని వార్తలు వస్తున్నాయి. ఆమె ఎవరో కాదు నివేదా థామస్. ఈ సినిమాలో ఒక డిఫరెంట్ పాత్రలో నివేదా థామస్ నటించనుందని అంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలకు గ్లామర్ కాకుండా నటనకు స్కోప్ ఉందని అంటున్నారు. అందుకే పెద్దగా ఎక్స్ పోజింగ్ లు చేయని వీరిని ఎంపిక చేసినట్టు సమాచారం. ఇక నివేదా ఈ యేడాది రజినీ కాంత్ హీరోగా తెరకెక్కిన ‘దర్బార్’ చిత్రంలో రజినీకాంత్ కూతురు పాత్రలో నటించింది. ఇక మరే సినిమా ఆమె సైన్ చేయలేదు. ఈ సినిమా ఒప్పుకుంటే ఆమెకు మరింత క్రేజ్ రావచ్చని భావిస్తున్నారు.

More Related Stories