మీడియా మీద మండిపడ్డ రకుల్...ఎప్పటికి మారతారో అంటూ

రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ ఈ మధ్య కాస్త నెమ్మదించింది. వరస ఫ్లాపులు తగలడం కొత్త హీరోయిన్ల ఎంట్రీతో రకుల్ కు టాలీవుడ్ ఆఫర్లు తగ్గాయి. అయితే రకుల్ తమిళ హిందీ సినిమాలపై ఎక్కువగా దృష్టి సారించింది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ భామ అందరిలా కాకుండా తన మీద ఎవరైనా గాసిప్ లు రాస్తున్నా, వారికి గట్టి కౌంటర్ లే ఇస్తుంటుంది. తాజాగా అలా రాసిన ఒక గాసిప్ వెబ్ సైట్ కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది రకుల్. ఆమె తమిళంలో శివకార్తికేయన్ తో ఒక సినిమా చేస్తోంది. అయితే ఆమె బిహేవియర్ వలన ఆ సినిమా నుండి తొలగించారని ప్రచారం జరిగింది. దీంతో రకుల్ ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించింది.
ఇలా మీడియాలో కథనాలు రాయడం సరైంది కాదని మండిపడింది. ఎప్పుడు మీడియా బాధ్యతతో నడుచుకుంటుంది..? ఎప్పుడు నిజ నిర్ధారణ చేసుకుంటుంది..అంటూ రకుల్ సెటైర్లు వేసింది. సినిమా షూటింగ్ లు మొదలవుతున్న క్రమంలో తాను మరో రెండు నెలల వరకూ షూటింగ్కు రానని రకుల్ దర్శక, నిర్మాతలకు తెలిపిందని, దీంతో ఆగ్రహించిన నిర్మాత ఆమెను సినిమా నుంచి తొలగించారని సదరు మీడియా వార్తలు వండి వడ్డించింది. దీంతో రకుల్ ఫైర్ అయింది.