English   

నటి మూడో పెళ్లి..పెళ్లి పెద్దలుగా ఇద్దరు కూతుళ్ళు

Vanitha Vijaykumar
2020-06-28 13:13:19

నటిగా పలు సినిమాల్లో నటించిన విజయ్ చందర్ కుమార్తె వనిత బిగ్ బాస్ కార్యక్రమంతో తమిళ ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. ఇప్పటికే రెండు పెళ్లిలు చేసుకున్న ఆమె ఆ ఇద్దరితో విడాకులు తీసుకుంది. ఇక తాజాగా ఆమె నిన్న మరో పెళ్లి చేసుకుంది. నెల రోజుల క్రితమే ఈ పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. పీటర్ పాల్ అనే వ్యక్తిని వనిత వివాహమాడింది. క్రైస్తవ సంప్రదాయ ప్రకారం నిన్న కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య చిత్ర నిర్మాత పీటర్ పాల్‌ను చెన్నైలోని తన నివాసంలోనే ఆమె వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఈ పెండ్లికి పెద్ద‌లు ఇంకెవరో కాదు వ‌నిత ఇద్ద‌రు కూతుళ్లే. వారే ద‌గ్గ‌రుండి మ‌రీ తమ తల్లి పెళ్లి జ‌రిపించారు. ఈ ఫొటోలు చూసిన వారంతా ఇప్ప‌టికైనా ఆమె ఈ వ్యక్తితో సంతోషంగా ఉండాల‌ని కోరుకుంటున్నామని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈమె తండ్రి విజయ్ చందర్ కి నటుడిగా మంచి పేరుంది.
 

More Related Stories