English   

బిగ్ బాస్ లోపల జరిగేదొకటి బయటకి చూపేదొకటంటున్న పున్నూ

 Punarnavi Bhupalam
2020-06-28 13:19:47

ఉయ్యాలా జంపాలా` చిత్రంతో కెరీర్ ప్రారంభించింది తెలుగమ్మాయి పునర్నవీ భూపాలం. ఆ సినిమాలో చిన్నారి పెళ్లి కూతురి ఫ్రెండ్ గా పక్కింటి అమ్మాయి లాంటి పాత్రలో నటించిన ఆమె ఆ తర్వాత హీరోయిన్ గా పిట్ట గోడ లాంటి కొన్ని సినిమాలు చేసింది. అయితే అలా హీరోయిన్‌గా నటించినప్పటికీ రాని గుర్తింపుని ‘బిగ్ బాస్’ షోలో కో కంటెస్టెంట్ తో ప్రేమాయాణం సాగించి అందిపుచ్చుకుంది. బిగ్ బాస్ హౌస్ లోనే గ్లామర్ ఒలక బోసిన ఆమె తరువాత బిజీగా మారింది. వరుస సినిమాలు, టీవీ షోలు, ఇంటర్వ్యూలతో పాటు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్‌తో క్షణం కూడా తీరిక లేకుండా గడిపేస్తుందని అనుకున్నా. సినిమాలు తప్ప మిగతావన్నీ కుదిరాయి. దీంతో సోషల్ మీడియాలో తన అందాలటో ఆకట్టుకునే ఫోటోలు పెట్టి ఫేమస్ అవుతోంది. 

ఇక తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో బిగ్ బాస్ షో మీద సంచలన వ్యాఖ్యలు చేసింది. "బిగ్ బాస్ షో మొత్తం ఎడిట్ చేసి చూపిస్తారని.. లోపల ఏం జరిగినా సరే వారికి నచ్చినట్టుగా మార్చుతారని ఆమె చెప్పుకొచ్చింది. రోజు మొత్తంలో ఎంతో జరుగుతుంది. కానీ వారికి కావాల్సిన ఫుటేజ్ మాత్రమే ఎడిట్ చేసి గంట మాత్రమే చూపిస్తారని, అది చూసి జనాలు అదే నిజమని ఫిక్స్ అయిపోతారని చెప్పుకొచ్చింది. ఇప్పటికీ బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరితో టచ్లో ఉన్నానన్న ఆమె అందరూ బాగా మాట్లాడతారని చెప్పింది. ఏదేమైనా తెలుగమ్మాయి కదా మన దర్శక నిర్మాతల కళ్ళల్లో పడక పోవచ్చు.

More Related Stories