తెలుగు హీరోలు వద్దంటే...బాలీవుడ్ కావాలంటోంది

అర్జున రెడ్డి సినిమా తెలుగులో ఎంత సంచలనం సృష్టించిందో పెద్దగా పరిచయం చేయక్కరలేదు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా నిలిచింది. హీరో విజయ్ కే కాకుండా దర్శకుడు సందీప్ వంగాకు ఈ చిత్రం తిరుగులేని గుర్తింపు తీసుకువచ్చింది. ఇదే సినిమాని హిందీలో కబీర్ సింగ్ గా తెరకెక్కించి బాలీవుడ్ దృష్టిని ఆకర్షించాడు ఆయన. ఆయన ఇంత వరకు అధికారికంగా ఓ మూవీ ప్రకటించలేదు. చాల రోజుల క్రితం కబీర్ సింగ్ నిర్మాతలతో మరో హిందీ మూవీ చేస్తున్నట్లు చెప్పారు. ఐతే ఆ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఆ తరువాత సందీప్ తన వద్ద ఉన్న స్టోరీ లైన్స్ తో ప్రభాస్, మహేష్ వంటి టాప్ స్టార్స్ ని కలిసినట్టుగా వార్తలు వచ్చాయి కానీ అందులో ఏదీ కన్ఫాం కాలేదు. నిజానికి సందీప్ కు టాలీవుడ్ లో సినిమా చేయడానికి హీరో దొరకలేదని తెలుస్తుంది. అయితే బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్ సందీప్ వంగ దర్శకత్వంలో పనిచేయడానికి ఇష్టపడుతున్నాడట. ఇప్పటికే రణ్బీర్ కపూర్ సందీప్ వంగను సంప్రదించి మంచి కథను తయారుచేయమని కోరినట్లు బాలీవుడ్ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. ముందే రణ్బీర్ కు సందీప్ కథ వినిపించాడట. గ్యాంగస్టర్ నేపథ్యంలో రానున్న ఈ సినిమాకి సంబంధించిన స్ర్కిప్టును కూడా సందీప్ సిద్ధం చేసినట్టు చెబుతున్నారు. చూడాలి మరి ఏమవుతుందో ?