ప్యాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తోన్న సంకల్ప్ రెడ్డి

ఘాజి తో తన సత్తా చాటుకున్న యంగ్ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి ఆ తరువాత వరుణ్ తేజ్ లీడ్ రోల్ లా అంతరిక్షం సినిమాతో ప్రేక్షకుల ముందుకువచ్చాడు. భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను మాస్ ప్రేక్షకులని పెద్దగా అలరించలేకపోయింది. ఈ సినిమా ఫలితం తో ఇకపై ప్రయోగాల జోలికి వెళ్లడని అంతా అనుకున్నారు కానీ సంకల్ప్ మాత్రం తన పద్దతిని మార్చుకోవడం లేదు. ముచ్చటగా మూడోసారి కూడా అలాంటి ప్రయోగం తోనే రాబోతున్నాడు. చేసిన ప్రతి చిత్రాన్ని ప్రయోగాత్మకంగా రూపొందిస్తూ అందరిచే ప్రశంసలు పొందడంతో మళ్ళీ ఈ సారి అంటార్కిటికా మంచులో జరిగే పరిశోదనల నేపథ్యంలో సినిమా చేయనున్నాడని ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే ఆ సినిమా సంగతి ఏమో కానీ ఆయన మరో సినిమా చేయనున్నాడని అంటున్నారు.
తాజా సమాచారం ప్రకారం ఆయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించి ఒక వాస్తవ ఘటనను ఆధారంగా చేసుకుని సంకల్ప్ రెడ్డి సినిమా తీయడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ కూడా పూర్తి అయిందని అంటున్నారు. అయితే ఇది టాలీవుడ్ కోసం కాదు, బాలీవుడ్ నటుడు విద్యుజమాల్ ఇందులో హీరోగా నటించనున్నారట. కరోనా ప్రభావం తగ్గి పరిస్థితులు కాస్త చక్కబడిన తర్వాత షూటింగ్‌ను స్టార్ట్ చేసే ప్లాన్ లో ఉన్నాడట. ఎటూ డైరెక్టర్ తెలుగు వాడే కాబట్టి తెలుగులోనూ రిలీజ్ చేయచ్చు, రియలిస్టిక్ సినిమా కాబట్టి మిగతా బాషలలో కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా మీద క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.