English   

కాజల్ గారు జాగ్రత్త.. కరోనాకు మీరు ఎవరో తెలియదు..

Kajal Aggarwal
2020-06-28 14:19:00

ఇప్పుడు కాజల్ అగర్వాల్ తీరు చూసిన తర్వాత అభిమానులు ఇదే అంటున్నారు. కరోనా వైరస్ కు భయపడి సినిమా వాళ్లు ఇంటి నుంచి అడుగు పెట్టడం లేదు. కానీ కాజల్ అగర్వాల్ మాత్రం అలాంటిదేం లేదు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను కాబట్టి కరోనా వైరస్ వల్ల తనకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు అంటుంది. ఆ ధైర్యంతోనే ఆమె మళ్లీ షూటింగ్ మొదలు పెట్టింది. మిగిలిన హీరోయిన్లు అందరూ ఇంట్లో ఉంటే చందమామ మాత్రం ఆన్ లొకేషన్ కి వచ్చేసింది. కొన్ని రోజుల ముందు రకుల్ కూడా ఇలాగే షూటింగ్ చేసింది. ఇప్పుడు కాజల్ అగర్వాల్ వంతు వచ్చింది. సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి తనకు ఏమీ ఇబ్బంది లేదు అని చెప్తుంది. ఈ మధ్యే ముంబైలో జరిగిన ఓ యాడ్ షూటింగ్‌లో కాజల్ పాల్గొంది. షూటింగ్‌లో కరోనా సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. అదే విధంగా... ఆమె ఎవరితో కూడా మాట్లాడకుండా యాడ్ కంప్లీట్ చేసి బయటకు వచ్చేసింది.

ఇలా ఉన్నప్పుడు కరోనా వైరస్ కు భయపడాల్సిన అవసరం లేదు అంటుంది చందమామ. కానీ ఆమె అభిమానులు మాత్రం జాగ్రత్తలు చెబుతున్నారు. కొన్ని రోజులు ఎలాంటి సినిమా షూటింగులు కానీ బయటకు రాకుండా ఇంట్లోనే ఉండటం మంచిది అంటూ ఆమెకు సలహా ఇస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బుకోసం చూసుకుంటే లేనిపోని తలనొప్పులు వస్తాయని ఆమెకు స్మూత్ వార్నింగ్ ఇస్తున్నారు. 

మరోవైపు కాజల్ అగర్వాల్ మాత్రం షూటింగ్ లో చాలా చాలా జాగ్రత్తగా ఉంది. సెట్ లో ఎవరైనా దగ్గరికి వచ్చి మాట్లాడినా కూడా ఈమె అసలు మాట్లాడలేదని.. మిగిలిన వాళ్లతో చాలా దూరంగా ఉంది అని తెలుస్తుంది. షూటింగ్ పూర్తవ్వగానే ఎవరితో మాట్లాడకుండా నేరుగా ఇంటికి వెళ్ళిపోయింది కాజల్. ఇక సినిమాల విషయానికి వస్తే తెలుగులో చిరంజీవి సరసన ఆచార్య.. తమిళనాట భారతీయుడు-2 సినిమాల్లో నటిస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే మరి కొన్ని రోజులు షూటింగ్ జరగనట్లే. దాంతో తన కమిట్మెంట్ పూర్తి చేసుకుంటుంది కాజల్ అగర్వాల్.

More Related Stories