కరణ్ జోహార్ డిప్రెషన్.. కీలక పదవికి రాజీనామా..

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత బాలీవుడ్ లో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇన్ని రోజులు నెపో కిడ్స్ ఏం చేసినా కూడా చూసి చూడనట్లు ఉన్నారు ప్రేక్షకులు. కానీ సుశాంత్ లాంటి స్టార్ హీరో ఆత్మహత్య చేసుకున్నాడు అంటే బాలీవుడ్ లో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థమైపోయాయి. ఇక్కడ బయట నుంచి వచ్చిన వాళ్లను ఎదగనివ్వకుండా ఎన్నో శక్తులు అడ్డుపడుతున్నాయనే విషయం తేటతెల్లమైపోయింది. దాంతో వారసుల సినిమాలు చూడకూడదని ఆడియన్స్ నిర్ణయం తీసుకుంటున్నారు. బీహార్ లాంటి రాష్ట్రాల్లో అయితే ఏకంగా బాలీవుడ్ సినిమాలను బ్యాన్ చేయాలని బ్యానర్లు కూడా కడుతున్నారు.
ఇలాంటి సమయంలో బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ పై విమర్శల వర్షం కురుస్తుంది. కేవలం ఆయన కారణంగానే సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అంటూ ఆయనపై మండి పడుతున్నారు అభిమానులు. మిగిలిన వాళ్ళను కూడా బ్లేమ్ చేసినా అందరికంటే ఎక్కువ కరణ్ జోహార్ నష్టపోతున్నాడు. ఇలాంటి సమయంలో బాలీవుడ్ పెద్దలు తన పక్షాన నిలబడకపోవడంపై కరణ్ కూడా బాగా హర్ట్ అయ్యాడని తెలుస్తోంది. అందుకే అందర్నీ అన్ ఫాలో చేస్తున్నాడు.. ఎవరితో మాట్లాడటం లేదు.. అందరినీ దూరం పెడుతున్నాడు అని తెలుస్తోంది. తాజాగా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన MAMI ఫిలిం ఫెస్టివల్ పదవి కూడా కరణ్ రాజీనామా చేశాడు. ఏదేమైనా కూడా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత ఆయన పై వస్తున్న విమర్శలకు తట్టుకోలేక కరణ్ కూడా డిప్రెషన్ లోకి వెళ్లిపోతున్నాడని ప్రచారం జరుగుతోంది.