English   

క్రిష్ సినిమాకు పవన్ కళ్యాణ్ కండీషన్స్..

Pawan Kalyan
2020-06-29 08:49:08

అన్ని అనుకున్నట్లు జరిగితే ఉంటే ఈపాటికి పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ అయిపోయి ఉండేది. ఈయన వకీల్ సాబ్ ఇప్పటికే విడుదలై నెల రోజులు గడిచిపోయేది. కానీ ఏం చేస్తాం ఈ మాయదారి కరోనా వైరస్ వచ్చి ఆయన ప్లాన్స్ అన్ని దెబ్బ కొట్టింది. ప్రస్తుతం క్రిష్ సినిమాతో పాటు హరీష్ శంకర్ సినిమాకు కూడా కమిట్ మెంట్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ఈ రెండు సినిమాల్లో ముందు క్రిష్ తెరకెక్కిస్తున్న సినిమా విడుదల కానుంది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాడు ఏఎం రత్నం. ఇదిలా ఉంటే ఈ సినిమా విషయంలో పవన్ కళ్యాణ్ కొన్ని కండిషన్స్ పెడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈయన ప్రస్తుతం కేవలం సినిమా హీరో మాత్రమే కాదు ప్రముఖ రాజకీయ నాయకుడు కూడా. అందుకే తనని తాను మార్చుకుంటున్నాడు. ఇదివరకు చేసిన సినిమాల్లో డాన్స్ లు, రొమాంటిక్ సీన్స్ ఇప్పుడు చేయలేనని దర్శక నిర్మాతలకు సున్నితంగా చెబుతున్నట్లు తెలుస్తోంది. 

ఈ క్రమంలోనే క్రిష్ సినిమాలో కేవలం రెండు పాటలు మాత్రమే ఉండబోతున్నాయి. అంతేకాదు ఈ సినిమాలో ఎలాంటి రొమాంటిక్ సన్నివేశాలు కూడా కనిపించవు. డాన్స్ లకు అసలు స్థానం కూడా లేదు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జాక్వలిన్ ఫెర్నాండేజ్ నటిస్తోంది. ఇది మాత్రమే కాదు రాబోయే సినిమాల్లో కూడా ఈ రెండు మోతాదు మించకుండా ఉండేలా పవన్ కళ్యాణ్ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. సినిమా చూసిన తర్వాత కచ్చితంగా విమర్శలు చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అందుకే ముందు జాగ్రత్త పడుతున్నాడు పవర్ స్టార్. తాను పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు జనసేన అధ్యక్షుడు అనే విషయం గుర్తు పెట్టుకున్నాడు. మరోవైపు క్రిష్ సినిమా షూటింగ్ ఇప్పట్లో మొదలు కాకపోవచ్చు అని తెలుస్తుంది. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. దీనికి విరూపాక్ష అనే టైటిల్ పరిశీలనలో ఉంది. మరి డాన్సులు రొమాన్స్ లేని పవన్ కళ్యాణ్ సినిమాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి. 

More Related Stories