ఆర్జీవీ మీద ఊహించని ఎటాక్..ఏమంటాడో

అనూహ్యంగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై నటి పూనమ్ కౌర్ కౌంటర్ ఎటాక్ చేశారు. తాజాగా ఆర్జీవీ పవన్ మీద ఒక సినిమా ప్రకటించాడు. ఆ సినిమాలో నటించేది ఇతనే అంటూ పవన్ పోలికలతో అతనికి డూప్ లా ఉన్న, ఒక వ్యక్తిని పరిచయం చేశాడు. అయితే ఈ విషయంలో పవన్ ఫ్యాన్స్ నుండి ఎటాక్ ఊహించిందే, కానీ ఎవరూ ఊహించని విధంగా పూనమ్ కౌర్ ఆర్జీవీని ఎటాక్ చేసింది. తాను చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఆర్జీవీ అంటే గౌరవం ఉండేదని, ఇప్పుడు ఆయనను చూసి తనకు బాధ కలుగుతోందని అన్నారు. అమ్మాయిల మానసిక బలహీనతను పసిగట్టడం, అసభ్యకరమైన భాషను ఉపయోగించమని వారిని ప్రేరేపించడం, తానే ట్వీట్స్ పంపి షేర్ చేయమని చెప్పడం, దీని గురించి మీడియాకు తెలియజేయడం వంటి పనులు చేసే ఆర్జీవీ అనే క్యారెక్టర్ ను కూడా దయచేసి సినిమాలో పెట్టండని పూనమ్ ట్వీట్ లో పేర్కొంది.
అలాగే ఒక పొలిటికల్ యాక్టివ్ గా ఉన్న వ్యక్తికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఒక గంటపాటు నాకు బ్రెయిన్ వాష్ చేసిన ఈ విశ్వాసఘాతుకుడైన డైరెక్టర్ ఫోన్ కాల్‌ను రికార్డు చేసి ఉంటే బాగుండేదని తనకు అనిపించిందని, అతను నాకు పంపిన ట్వీట్స్‌ను సంబంధిత వ్యక్తికి నేను అప్పుడే పంపానని, అదృష్టం కొద్దీ మీడియాలో కొంత మంది నిజాయతీపరులు ఉన్నారు. లేకపోతే నీ కుట్రలకు నేను బలైపోయేదాన్నని వర్మను ఉద్దేశించి పూనమ్ సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఆర్జీవీని పూనమ్ ఎవరిని సంబంధించి ఈ ట్వీట్ లు చేసిందో ఇప్పటికే అందరికీ అర్ధమై ఉంటుంది.