English   

బాలయ్య తోపు.. పవన్‌కు నేను ఫ్యాన్.. వర్మ సంచలనం..

Ram gopal varma
2020-06-29 09:21:06

ఎవరి పేరు చెబితే కాంట్రవర్సీలు కాళ్ల కింద చక్రాలు కట్టుకుని మరీ వాలిపోతాయో.. ఎవరి పేరు చెబితే విమర్శలు విమానం ఎక్కి మరీ వచ్చేస్తాయో.. ఎవరి పేరు చెబితే గుట్టలు గుట్టలుగా తిట్ల దండకం చదువుతారో అతడే రామ్ గోపాల్ వర్మ. ఈయన పేరుకు పరిచయం అవసరం లేదు.. తన పేరుతో పరిచయం లేకపోయినా అస్సలు ఫీల్ అవ్వడు. ఈ మధ్య మళ్లీ వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్నాడు ఈయన. అసలీయన వార్తల్లో ఉండనిదెప్పుడు..? తాజాగా ఈయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలువురు సినీ రాజకీయ ప్రముఖుల గురించి సెటైర్లు వేసాడు. ముందుగా బాలయ్య పాడిన శివ శంకరీ పాట గురించి చెప్తూ.. ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్.. సంగీతం కనిబెట్టిన తర్వాత ప్రపంచ చరిత్రలో తాను చూసిన అద్భుతమైన గాయకుడు బాలయ్య ఒక్కడే అని సెటైర్లు వేసాడు వర్మ. ఈ భూమ్మీద బాలయ్య కంటే గొప్ప గాయకుడు ఉన్నాడని ఎవరైనా చెప్తే తాను ఒప్పుకోనంటున్నాడు వర్మ. కానీ తన సినిమాల్లో ఛాన్స్ ఇస్తారా అంటే నో అంటున్నాడు. గాయకుడిగా బాలయ్య స్థాయి అందుకోవడం తనకు లేదని.. ఆయన పాట ముందు తన సినిమాలు చాలా చిన్నవని చెప్పుకొచ్చాడు వర్మ.

పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. తాను అతడికి పెద్ద ఫ్యాన్ అని చెప్పాడు. తనకంటే పెద్ద అభిమాని తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్‌కు ఎవరూ లేరని ఒట్టేసి చెప్తానంటున్నాడు వర్మ. రాజకీయ నాయకులను కూడా టార్గెట్ చేసాడు వర్మ. తనకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటతీరు, భాష, యాస, మేనరిజమ్స్ అంటే చాలా యిష్టమని చెప్పాడు. అయితే తన పరిపాలన గురించి మాత్రం తనకు తెలియదని చెప్పుకొచ్చాడు ఈ దర్శకుడు. రాజకీయ నాయకుల్లో తనకు లోకేష్ పెద్ద కమెడియన్‌గా కనిపిస్తాడని.. ఆయన కామెడీ బాగుంటుందని సంచలన వ్యాఖ్యలు చేసాడు వర్మ. చంద్రబాబు గురించి మాట్లాడుతూ.. ఆయన ఒకవేళ సడన్‌గా ప్రత్యక్షం అయితే నిజంగా ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచారా లేదా తన చెవిలో చెప్పమని అడుగుతానని చెప్పాడు వర్మ. జగన్ జీవితంపై బయోపిక్ చేస్తారా అంటే తనకు ఆయన జీవితంలో డ్రామా కనిపించలేదని సమాధానమిచ్చాడు వర్మ. చంద్రబాబు జీవితంలో ఉన్నంత డ్రామా తనకు జగన్ జీవితంలో చూడలేదని చెప్పాడు ఈయన. భవిష్యత్తులో తనకు ఏదైనా పాయింట్ దొరికితే కచ్చితంగా జగన్‌పై సినిమా చేస్తానని చెప్పాడు ఈ దర్శకుడు. 

More Related Stories