English   

విజయ్ దేవరకొండే కావాలంటున్న మహేష్ బాబు..

Vijay Devarakonda
2020-06-29 09:33:27

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కోసం పెద్ద పెద్ద దర్శకులు కూడా వేచి చూస్తున్నారు. ఫ్లాపులు వచ్చినా కూడా ఈయన తన రేంజ్ అలాగే మెయింటేన్ చేస్తున్నాడు కూడా. ఇక నిర్మాతలు కూడా విజయ్ డేట్స్ ఇస్తే అదే మహాభాగ్యంగా ఫీలవుతున్నారు వాళ్లు. ఎందుకంటే ఈయనతో 10 కోట్లు పెట్టి సినిమా తీస్తే హిట్ అయితే 30 కోట్లు ఖాయం. నిర్మాతల పాలిట బంగారుకొండలా మారిపోయాడు విజయ్ దేవరకొండ. ఈ మధ్య అంటే కాస్త వెనకబడిపోయాడు కానీ అలాగని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఒక్క హిట్ పడితే విజయ్ మళ్లీ పుంజుకుంటాడనడంలో సందేహం లేదు. దాంతో ఆయన డేట్స్ కు చాలా క్రేజ్ ఉంది ఇప్పుడు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. దాంతో పాటు శివ నిర్వాణ సినిమాకు కమిట్ మెంట్ ఇచ్చాడు విజయ్. ఇదిలా ఉంటే తాజాగా ఒక క్రేజీ కాంబినేషన్ కోసం విజయ్ దేవరకొండ రెడీ అవుతున్నాడు.

సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ నిర్మాతగా మారి విజయ్ దేవరకొండతో ఒక సినిమా నిర్మించాలని చూస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై మహేష్ బాబు కూడా విజయ్ దేవరకొండతో మాట్లాడాడని.. ఆయన డేట్స్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య మహేష్ బాబు కుటుంబంతో విజయ్ దేవరకొండకు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ మధ్య మహేష్ నటించిన మహర్షి సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు కూడా విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా వచ్చాడు. తనకు చిన్నప్పటి నుంచి మహేష్ బాబు అంటే ప్రాణం అని స్టేజి మీద సూపర్ స్టార్ పై తనకున్న ప్రేమను చెప్పుకున్నాడు విజయ్ దేవరకొండ. ఇదే సెంటిమెంట్ వాడుకుంటూ విజయ్ దేవరకొండ డేట్స్ నమ్రతా శిరోద్కర్ తీసుకుందని తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఈ సినిమాను పట్టాలెక్కించలే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే దీనికి దర్శకుడు ఎవరనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఒకవేళ ఈ కాంబినేషన్ వర్కవుట్ అయితే మాత్రం తెలుగు ఇండస్ట్రీలో మరో క్రేజీ కాంబినేషన్ కు తెరలేచినట్టే.

More Related Stories