English   

హీరో వెంకటేష్‌తో శేఖర్ కమ్ముల సినిమా 

Venkatesh
2020-06-29 12:37:46

కుర్ర హీరోలతో కూడా పోటాపోటీగా సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు విక్టరీ వెంకటేష్. ప్రస్తుతం శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో వెంకటేష్‌ ‘నారప్ప’ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఇది ప్రస్తుతం షూట్ మధ్యలో ఉంది. కరోనా కారణంగా ఈ షూట్ వాయిదా పడిందనుకోండి అది వేరే విషయం. అయితే ఇప్పటికే ఆయన మరో రెండు సినిమాలు లైన్ లో పెట్టాడు. ఒకటి తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో కాగా మరొకటి త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో ఉండనుంది. అయితే ఈయన తాజాగా ఒక సినిమా ఒప్పుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. అది మరెవరితోనో కాదు శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఉండనుందని చెబుతున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కడానికి సన్నాహాలు జరుగుతున్నని అంటున్నారు. ఈ లాక్‌ డౌన్‌ సమయంలో ఓ స్క్రిప్ట్‌ ను రెడీ చేశారట శేఖర్‌ కమ్ముల. ఆ కథలో వెంకటేష్‌ హీరోగా నటించబోతున్నారని అంటున్నారు. ఇప్పుడు నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల ‘లవ్‌స్టోరీ’ అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

More Related Stories