English   

వకీల్ సాబ్ నుండి మరో పిక్ లీక్...టెన్షన్ లో యూనిట్

vakeel saab
2020-06-29 12:48:55

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో దాదాపు రెండేళ్ళ తరువాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అజ్ఞాతవాసి సినిమా తర్వాత మళ్లీ సినిమాలు చేయనని చెప్పిన పవన్ కళ్యాణ్, పింక్ సినిమాకి రీమేక్ వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. బోణీ కపూర్, దిల్ రాజు నిర్మాతలుగా వేణుశ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కరోనా లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌ నిలిచిపోయింది. ఒకసారి ఈ సినిమా నుండి పిక్స్ లీక్ కాగా అప్పట్లో పెద్ద రచ్చె జరిగింది. అయితే తాజాగా చిత్రంలోని కోర్టు సీన్‌కి సంబంధించిన పిక్ ఒక‌టి లీక్ అయింది. లీకయిన పిక్ కోర్ట్ లో పవన్ వాదిస్తున్న సన్నివేశం కాగా, ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌డ్జితో మాట్లాడుతున్న‌ట్టుగా ఉంది. పిక్ మీద ఫర్ వీఎఫ్ఎక్స్ అని ఉండడంతో టెక్నికల్ టీం నుండే లీకయిందని అంటున్నారు. నివేదాథామస్‌, అంజలి, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా అది వాయిదా పడింది.  

More Related Stories