English   

జానకమ్మ ఇక లేరంటూ ప్రచారం..క్లారిటీ ఇచ్చిన ఫ్యామిలీ

Janaki health
2020-06-29 17:25:50

సోషల్ మీడియా ఎంతగా అభివృద్ధి చెందిందంటే మీడియాలో న్యూస్ వచ్చే కంటే ముందే ఇక్కడ ప్రత్యక్షం అవుతున్నాయి. అయితే ఇందులో వచ్చే న్యూస్ కి ఎవరూ బాధ్యులు కారు. వీరిని ప్రభుత్వాలు సైతం కట్టడి చేయలేకపోవడంతో రకరకాల వార్తలను నిజమనేలా ప్రచారం చేస్తున్నారు. తాజగా దిగ్గజ గాయని ఎస్ జానకి ఇకలేరనే వదంతులు నిన్న సాయంత్రం నుండి సోషల్ మీడియాలో విపరీతంగా స్ప్రెడ్ అయ్యాయి. ఈ తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో చూసిన ఆమె అభిమానులు షాక్‌ కు గురయ్యారని చెప్పాలి. ఇక ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెంది జానకి ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చారు. జానకమ్మ ఆరోగ్యంపై ఇలాంటి వదంతులు దయచేసి వ్యాప్తి చేయొద్దని విజ్ఞప్తి చేశారు. నిజానికి జానకికి ఒక చిన్న శస్త్రచికిత్స జరిగగా ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. అయితే ఆమె ఆసుపత్రిలో ఉండగా ఆమె కన్నుమూశారంటూ వదంతులను ఇంటర్నెట్‌ లో వ్యాప్తి జరుగుతోంది. జానకమ్మ ఆరోగ్యం గురించి గాయకుడు మనో స్పందించారు. ఇప్పుడే జానకి అమ్మతో మాట్లాడానని, ఆమె మైసూరులో ఉన్నారని పేర్కొన్నారు. ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారన్న మనో, దయచేసి వదంతులు వ్యాప్తి చేయకండని కోరారు. ఎస్పీ బాలు కూడా ఇలా వదంతులు వ్యాప్తి చేయడం సరికాదని పేర్కొన్నారు.

More Related Stories