English   

నితిన్ అంధాదున్‌ కు కొత్త అడ్డంకులు

Nithiin
2020-06-29 18:01:14

కుర్ర హీరో నితిన్‌ ప్రస్తుతం వరుస సినిమాలు అనౌన్స్ చేసి మంచి ఫాంలో ఉన్నాడు. తాజాగా భీష్మతో సూపర్ హిట్ అందుకున్న ఈ హీరో భీష్మతో పాటే వెంకీ అట్లూరి, చంద్రశేఖర్‌ యేలేటి, కృష్ణ చైతన్యలతో సినిమాలు కూడా ఓకే చేశాడు. ఇక తాజాగా ఆయన మేర్లపాక గాంధీతో ‘అంధాదున్‌’ రీమేక్‌ కూడా పట్టాలెక్కించాడు. మొన్నామధ్య పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది కూడా. అయితే లాక్‌డౌన్‌ కారణంగా రెగ్యులర్‌ షూటింగ్‌ మాత్రం జరగడం లేదు. ఇక ఈ సినిమా మాతృక ప్రకారం ఈ సినిమాలో విలన్‌ ఓ లేడీ. మాతృకలో ఈ పాత్రను టబు అద్భుతంగా నటించింది. అందుకే ఇప్పుడు తెలుగు రీమేక్‌లోనూ ఆ పాత్రను ఆమెతోనే చేయించాలని నితిన్ సినిమా యూనిట్ కూడా ప్రయత్నించినట్లు అయితే రెమ్యునరేషన్ కుదరక వదిలేశారని ప్రచారం జరిగింది.  అయితే ఆ పాత్రలో ఒకప్పటి హీరోయిన్ శిల్పా శెట్టి నటించనుందని ఒకసారి లేదు రమ్య కృష్ణను ఎంపిక చేశారని కూడా ప్రచారం జరిగింది. కానీ ఎవరూ ఈ సినిమాని, ఆ పాత్రను చేయడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే అది నెగటివ్ క్యారెక్టర్ కాబట్టి, ఈ క్రమంలో కాస్టింగ్ విషయం మళ్ళీ మొదటికి వచ్చినట్లైంది. అందుకే ఈ సినిమా ఇప్పట్లో పట్టాలు ఎక్కేలా కనిపించడం లేదు.

More Related Stories