English   

ఆహాలో తమన్నా టాక్ షో..ఇదిగో ఫుల్ డీటైల్స్

Tamannah
2020-06-29 18:32:13

తెలుగులో టాప్ ప్రొడ్యూసర్ గా ఉన్న అల్లు అరవింద్ ఆహా అని ఒక ఒటీటీ ప్లాట్ ఫాం లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అది ఇప్పటికే లీడింగ్ లో ఉన్న యాప్ స్ తో పోటీ పడలేక పోతోంది. అందుకు ముఖ్య కారణం, లీడింగ్ యాప్స్ అన్నీ ముందే పెద్ద సినిమాల మీద కర్చీఫ్ వేసేస్తున్నాయి. అయితే ఇప్పుడు అంత బడ్జెట్ లు పెట్టి సినిమాలు కొనే ఉద్దేశంలో ఆయన లేరట. అందుకే మంచి టాక్ షో ఒకటి ప్లాన్ చేస్తే అలా అయినా జనం ఎంజేజ్ అవుతారని ఆయన భావిస్తున్నారు. ఇక అందుకే మిల్కీ బ్యూటీ తమన్నా ఆహా కోసం టాక్ షో ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు. అయితే పెద్దగా ఇష్టం లేకున్నా అల్లు అరవింద్ స్వయంగా అడగడంతో తమన్నా ఈ షోకు సైన్ చేసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన కాఫీ విత్ కరణ్ షో తరహాలో ఇది కూడా ఎంటర్టైనింగ్ గా ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు. ఈ షో కోసం వివిధ రౌండ్ లు ఇప్పటికే డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఆహా టీమ్ ఇప్పటికే ఈ షోకు సెలెబ్రిటీల లిస్ట్ ను ప్రిపేర్ చేస్తున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే మొదటి ఎపిసోడ్ చిరంజీవి లేదా చరణ్ తో చేస్తారట. అన్నపూర్ణ స్టూడియోలో ఈ షో తాలూకా సెట్ నిర్మాణం మొదలవుతుందని, మళ్ళీ స్టార్స్ షూటింగ్స్ అంటూ బిజీ కాకముందే వీలైనన్ని ఎక్కువ ఎపిసోడ్స్ ను చిత్రీకరించాలని ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. తెలుగులో ఇలాంటి కాన్సెప్ట్ తో చాలా షోలు వచ్చాయి, లక్ష్మి టాక్ షో, ప్రదీప్ షో, రానా నెం 1 యారీలు మంచి పేరు తెచ్చుకున్నాయి.  

More Related Stories