English   

కుటుంబాన్ని పోషించడం కోసం కూరగాయలు అమ్ముకుంటున్న నటుడు..

 Roshan Shinge
2020-06-30 07:28:10

కరోనా మహమ్మారి ఎంతో మంది జీవితాలని అతలా కుతలం చేసింది. అంతకు ముందు బాగా బతుక్కపోయినా బతికే ఉన్నారు. కానీ కరోనా కొందరి జీవితాలను పూర్తిగా నాశనం చేసింది. తినడానికి కూడా తిండి లేక పూట గడవక ఎన్నో కుటుంబాలు నరకయాతన అనుభవిస్తున్నాయి. అందులో కొందరు సినిమా వాళ్లు కూడా ఉన్నారు. చిన్నచిన్న నటులకు షూటింగు ఉంటేనే ఉపాధి వస్తుంది. ఇప్పుడు సినిమా షూటింగ్ ఏవి జరగకపోవడంతో వాళ్లు ఉపాధి కోల్పోయారు. సంపాదన లేదు.. కుటుంబ పోషణ భారంగా మారిపోయింది. అందుకే కొందరు తమ సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఒక నటుడు తోపుడు బండిపై కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 

మరాఠీ నటుడు రోషన్‌ సింగ్ పొట్టకూటి కోసం కూరగాయలు అమ్ముకుంటున్నాడు. ఇదే విషయాన్ని పలువురు బాలీవుడ్ నటులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రోషన్ సింగ్ కూరగాయలు అమ్ముతున్న వీడియో తీసి బాలీవుడ్ నటుడు జావేద్ హైదర్, బిగ్‌ బాస్ ఫేమ్ డాలీ బింద్రా టిక్‌ టాక్‌ లో షేర్ చేశారు. అతనిని చూసి అభిమానులు ఎలాంటి భేషజాలు లేకుండా కుటుంబ పోషణ కోసం మీరు చేస్తున్న ఈ పని అద్భుతంగా ఉంది అంటూ నన్ను ప్రశంసిస్తున్నారు. ఆ మధ్య బాలీవుడ్ సినిమా డ్రీమ్ గార్ల్‌లో ముఖ్య పాత్ర పోషించిన నటుడు సోలంకి దివాకర్‌ కూడా ఉపాధి లేక పండ్లు అమ్ముకున్నాడు. మరి కొందరు నటులు కూడా వేర్వేరు వృత్తుల్లో పని చేసుకుంటూ గడిపేస్తున్నారు. 

More Related Stories