English   

కృష్ణ లీలలు ఓటీటీలో కాదు థియేటర్ లో రావాల్సింది..

Krishna And His Leela
2020-06-30 07:38:32

కరోనా వైరస్ కారణంగా 100 రోజులకు పైగానే అయింది థియేటర్లు అన్నీ మూసేసి. దాంతో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిపోయింది. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక నిర్మాతలు చుక్కలు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది తమ సినిమాలను డిజిటల్ ప్లాట్ ఫాంలో విడుదల చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, జ్యోతిక, కీర్తి సురేష్ ఇలా పెద్ద పెద్ద వాళ్ళు నటించిన సినిమాలు కూడా నేరుగా ఓటిటిలో రిలీజ్ అయ్యాయి. కానీ ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోలేదు. ఒకవేళ థియేటర్స్ ఓపెన్ ఉన్నా కూడా ఈ సినిమాలో అక్కడ విడుదల అయితే ఖచ్చితంగా ఫ్లాప్ అయ్యేవి. ఇలాంటి సమయంలో ఓటిటి అంటే కేవలం ఫ్లాప్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అంటూ ప్రచారం జరుగుతున్న వేళ అది తప్పు అని నిరూపించడానికి ఒక సినిమా వచ్చింది. దాని పేరు కృష్ణ అండ్ హిస్ లీల. 

గుంటూరు టాకీస్ సినిమా లో రష్మి గౌతమ్ తో అదిరిపోయే రొమాన్స్ చేసిన సిద్ధు జొన్నలగడ్డ ఇందులో హీరో. కథ స్క్రీన్ ప్లే కూడా రాశాడు. క్షణం సినిమా దర్శకుడు రవికాంత్ ఈ కృష్ణ లీలలు తెరకెక్కించాడు. నేటి యువత ఆలోచనలు, వాళ్ల రిలేషన్ షిప్స్, ప్రేమ, కన్ఫ్యూజన్ ఈ కథలో చూపించాడు రవికాంత్. ఎలాంటి అంచనాలు లేకుండా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. సినిమా బాగుంది అంటూ సోషల్ మీడియాలో కూడా బాగానే ప్రచారం జరుగుతుంది. నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాను స్ట్రీమ్ చేస్తుంది. సినిమా చూసిన తర్వాత అనవసరంగా దీన్ని ఓటీటీలో విడుదల చేశారు.. థియేటర్లో రావాల్సింది అంటున్నారు ప్రేక్షకులు. సురేష్ బాబు ఈ సినిమాను సమర్పించాడు. 

More Related Stories