English   

అకిరా నందన్ ఎంట్రీ ఎప్పుడు.. రేణు దేశాయ్ రియాక్షన్ ఇదే..

akira nandan
2020-06-30 07:44:51

పవన్ కళ్యాణ్ వారసుడు అకిరా నందన్ సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడు అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ కుర్రాడి వయస్సు కేవలం 16 ఏళ్లు మాత్రమే. అయినా కూడా ఆయన ఎంట్రీ కోసం చూస్తున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే ఎదిగిన విధానం అలా ఉంది. పదహారేళ్ళ వయసులోనే 6 అడుగుల 4 అంగుళాలు పెరిగిపోయాడు ఈ కుర్రాడు. మరో రెండు మూడేళ్లలో వరుణ్ తేజ్ ను కూడా మించిపోయేలా కనిపిస్తున్నాడు. దాంతో పవన్ వారసుడు సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడు అంటూ నేరుగా రేణు దేశాయ్ ని ప్రశ్నించారు నెటిజన్లు. ఈ మధ్యే సోషల్ మీడియాలో అభిమానులతో కాసేపు ముచ్చటించి రేణు. ఈ క్రమంలోనే చాలా విషయాలపై స్పష్టత ఇచ్చింది ఈమె. మరీ ముఖ్యంగా అకీరా నందన్ సినిమాల్లో కి వస్తాడా రాడా అనే విషయంపై కూడా రేణు దేశాయ్ కుండ బద్దలు కొట్టేసింది. 

తన కొడుకు సినిమాలు చేస్తాడా చేయడా అనేది పూర్తిగా ఆయన నిర్ణయానికి వదిలేశాను అంటూ చెప్పుకొచ్చింది ఈ మాజీ హీరోయిన్. కుటుంబమంతా సినిమాల్లో ఉంది కాబట్టి తను కూడా హీరో అవ్వాలి అని ఎవరు అకీరాపై ఒత్తిడి తీసుకురాలేదని.. నటుడిగా మారతాడా లేదా అనేది పూర్తిగా అతడి స్వేచ్ఛకు వదిలేస్తున్నాను అంటూ చెప్పింది రేణు. తనకు నచ్చింది తాను చేస్తాడు కానీ ఖచ్చితంగా సినిమాల్లోకి వెళ్ళాలి అని ఒత్తిడి మాత్రం తీసుకురాను అని చెప్పింది. అయినా ప్రస్తుతం తన కొడుక్కి 16 ఏళ్ళు మాత్రమే అని.. ఇంకా చాలా సమయం ఉంది అంటూ సమాధానం ఇచ్చింది. మహేష్ బాబు సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారట అని అడిగితే ఈ మధ్య కాలంలో నేను విన్న అతి పెద్ద జోక్ ఇదే అంటూ కొట్టిపారేసింది రేణు దేశాయ్. 

More Related Stories