English   

ఆచార్య సినిమాలో చిరంజీవి డబుల్ రోల్ చేస్తున్నాడా..

 Acharya
2020-06-30 09:06:12

పాపం కొరటాల శివ ఏ సమయంలో చిరంజీవి ఆచార్య కథ చెప్పాడో తెలియదు కానీ రోజురోజుకు ఆలస్యం అవుతూనే ఉంది. భరత్ అనే నేను సినిమా వచ్చి రెండేళ్లు దాటిపోయినా కూడా ఇప్పటివరకు మరో సినిమా విడుదల చేయలేదు కొరటాల శివ. కేవలం చిరంజీవి కోసం వేచి చూస్తున్నాడు. అంతలోనే కరోనా వైరస్ వచ్చి ప్లాన్స్ అన్ని పాడు చేసింది. అయితే ఎంత ఆలస్యం అయినా కూడా చిరంజీవి అభిమానులకు ఆచార్య విందు భోజనంలా ఉంటుందని కొరటాల శివ హామీ ఇస్తున్నాడు. సైరా సినిమాతో కొంతవరకే ప్రేక్షకులను మెప్పించాడు మెగాస్టార్. ఈ సినిమా తెలుగులో పర్లేదు అనిపించింది కానీ మిగిలిన భాషలలో డిజాస్టర్. దాంతో ఖచ్చితంగా ఇప్పుడు ఆచార్య సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని తన సత్తా చూపించాలని చూస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. 

ఇదిలా ఉంటే ఆచార్య గురించి ఇప్పుడు మరో విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఇందులో రామ్ చరణ్ కీలకపాత్రలో నటించబోతున్నాడు. అరగంట పాటు ఉండే ఈ పాత్ర కథను మలుపు తిప్పుతుందని కొరటాల శివ చెప్పాడు. ఇందులో చనిపోయే పాత్ర చేస్తున్నాడు రామ్ చరణ్. ఆయన క్యారెక్టర్ మాజీ నక్సలైట్ గా ఉండబోతుంది. చరణ్ చనిపోయిన తర్వాత కథ అసలు మలుపు తిరుగుతుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో మరో చిరంజీవి ఉంటాడని.. ఈ ద్విపాత్రాభినయం ప్రేక్షకులకు సర్ప్రైజ్ గా కొరటాల శివ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. వీలైనంత త్వరగా షూటింగ్ వదిలిపెట్టి సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు కొరటాల. రామ్ చరణ్ మ్యాట్ని ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి ఆచార్య సినిమాను నిర్మిస్తున్నాడు. ఖైదీ నెంబర్ 150 తర్వాత మరోసారి కాజల్ ఇందులో హీరోయిన్ గా నటించబోతోంది. చాలా సంవత్సరాల తర్వాత మణిశర్మ మరో సారి చిరంజీవి సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. 
 

More Related Stories